Iphone 14 Price: అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్‌ 14, ట్రెండ్‌ సెట్‌ చేస్తుందా!

28 Jul, 2022 17:39 IST|Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త. యాపిల్‌ ఐఫోన్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లు సెప్టెంబర్‌ 13న విడుదల కానున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఐఫోన్‌ 14 ప్రాసెసర్‌ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

గతేడాది సెప్టెంబర్‌ 24 వరకు విడుదలైన ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌ల వరకు ఏ15 ప్రాసెసర్‌ ఉండేది. అయితే మరికొన్ని నెలల్లో మార్కెట్‌కు పరిచయం కానున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లైన ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 మ్యాక్స్‌,ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌లలో ఏ15కు అడ్వాన్స్‌ వెర్షన్‌గా ఏ16 ప్రాసెసర్‌ ఉంటుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ గేమింగ్‌ ఫర్మామెన్స్‌ కోసం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 14 ప్రో ఫోన్‌లలో మాత్రమే  ఈ ఏ16 ప్రాసెసర్‌ ను వినియోగించినట్లు సమాచారం. 

ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ ప్రత్యేకతలివే
మ్యాక్‌ వరల్డ్‌ నివేదిక ప్రకారం..ఏ 16 బయోనిక్‌ ప్రాసెసర్‌ చాలా ప్రత్యేకమైందని తెలుస్తుంది. టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎంతో ఈ అడ్వాన్స్‌ వెర్షన్‌ ప్రాసెసర్‌ను తయారు చేశారు. 18 బిలియన్ నుండి 20 బిలియన్ ట్రాన్సిస్టర్‌లతో (A15లో 15.8 బిలియన్ల నుండి పెరిగింది) రానుంది.  

ఐఫోన్‌ 14 స్పెసిపికేషన్‌ 
ఐఫోన్‌14 ఫోన్‌ 6.1 అంగుళాల డిస్‌ప్లే . వీడియోలు చూసేందుకు, గేమ్స్‌ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్‌ రెజెల్యూషన్‌, 4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయల్‌ సెటప్‌ రేర్‌ కెమెరా ఉంది. ఫోన్‌తో అద్భుతమైన ఫోటోల్ని తీసేందుకు 12ఎంపీ ప్లస్‌ 12ఎంపీ కెమెరాలు,సెల్ఫీలు దిగేందుకు, వీడియో కాల్స్‌ చేసుకునేందుకు ఫోన్‌ ముందు భాగంలో 12ఎంపీ ప్లస్‌ ఎస్‌ఎల్‌ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్‌ వీ 15 ఆపరేటింగ్‌ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాలు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్‌ ఉన్నాయి. ముఖ్యంగా వైఫై,మొబైల్‌ హాట్‌ స్పాట్‌, బ్లూటూత్‌, 5జీ నెట్‌ వర్క్‌కు  సపోర్ట్‌ చేస‍్తుండగా..ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 64వేల నుంచి రూ.71,500వరకు ఉండనున్నట్లు అంచనా.

మరిన్ని వార్తలు