లాంచ్‌కు ముందే ఐఫోన్ 16 వివరాలు లీక్!

18 Feb, 2024 19:50 IST|Sakshi

యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీటి ధరలు రూ.58 వేలు నుంచి రూ.91 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి ఖచ్చితమైన ధరలు కాదు, కంపెనీ ఈ ఐఫోన్ 16 లాంచ్ చేసే సమయంలో అధికారిక ధరలను వెల్లడిస్తుంది.

ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఉన్న ఇతర మోడల్స్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుందని, కొత్త వేరియంట్స్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ డిస్​ప్లేలు ఉంటాయని సమాచారం. కొత్త ఐఫోన్ 16లో సింగిల్​ పిల్​ షేప్​లో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఎంతవరకు వాస్తవమని విషయం తెలియాల్సి ఉంది.

డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు