-

షిప్‌మెంట్‌లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఇదే!

23 Dec, 2021 13:38 IST|Sakshi

ఈ ఏడాది క్యూ3 ఫలితాల్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు దుమ్మురేపుతున్నాయి. తాజాగా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ షిప్‌మెంట్‌పై 'స్ట్రాటజీ అనలిటిక్స్‌' సంస్థ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యాపిల్‌ సంస్థ ప్రపంచంలోనే  షిప్‌మెంట్‌ విభాగంలో అగ్రస్థానంలో నిలవగా షియోమీ రెండో స్థానంలో, శాంసంగ్ మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ప్రస్తుతం 5జీ మార్కెట్‌ వరల్డ్‌ వైడ్‌గా 25శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదికలో పేర్కొంది.  

ఐఫోన్‌ 12
ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ గతేడాది 5జీ టెక్నాలజీని సపోర్ట్‌ చేస్తూ ఐఫోన్‌ 12 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసిన రెండు వారాల్లోనే సేల్స్‌ జరిగి...ఐఫోన్ 12 ,ఐఫోన్ 12 ప్రో'లు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన 5జీ ఫోన్‌లుగా నిలిచాయి. తాజాగా స్ట్రాటజీ అనలిటిక్స్ నివేదిక సైతం 5జీ మార్కెట్‌లో యాపిల్‌ తొలిస్థానంలో కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో యాపిల్‌  షావోమీని వెనక్కి నెట్టిందని స్ట్రాటజీ అనలిటిక్స్ డైరెక్టర్ కెన్ హైర్స్ తెలిపారు. ఐరోపాలో శాంసంగ్, చైనాలో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ కారణంగా షావోమీ అమ్మకాలు తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. షావోమీ హెడ్‌ క్వార్టర్స్‌ చైనాలో మాత్రం 5జీ స్మార్ట్‌ఫోన్‌ లపై ఆఫర్లు ప్రకటించడంతో డిమాండ్‌ పెరిగినట్లు వెల్లడించారు.

శాంసంగ్‌ సైతం 3వ త్రైమాసికంలో గ్లోబల్ 5జీ ఫోన్ షిప్‌మెంట్‌లలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒప్పోను వెనక్కి నెట్టింది. శాంసంగ్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ సౌలభ్యంతో పాటు ఫోల్డబుల్‌ ఫోన్‌ కారణంగా శాంసంగ్‌కు డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది. 4వ స్థానంలో ఒప్పో తర్వాత వివో ఐదో స్థానాన్ని సంపాదించుకోగా...హానర్‌ తన మాతృ సంస్థ  హువావే నుంచి విడిపోవడంతో ద్వారా హానర్‌ ఈ త్రైమాసికంలో 194శాతం వృద్ధిని సాధించినట్లైందని స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. 

చదవండి: వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు

మరిన్ని వార్తలు