సముద్రంలో పడిన ఐఫోన్‌, 'బ్రాండ్‌' బాబుకు దొరికిందోచ్‌!

26 Jun, 2022 14:01 IST|Sakshi

సోషల్‌ మీడియాతో ఎంత నష‍్టం ఉందో... అంతే లాభం ఉందనే ఘటనొకటి చోటు చేసుకుంది. ఇంగ్లాడ్‌లోని  గ్లౌసెస్టర్‌షైర్ నివాసి ఓవైన్ డేవిస్ ఏడాది క్రితం  దురదృష్టవ శాత్తు 'వై నది'లో ఐఫోన్‌ను పడేసుకున్నాడు. నదిలో ఫోన్‌ జారి పడితే దొరుకుతుందా? దొరకదు. అదే బాధతో ఇంటికి తిరిగి వెళ్లాడు. కానీ పదినెలల తర్వాత నదిలో పడిన ఫోన్‌ దొరికింది. సోషల్‌ మీడియాతో ఆ ఫోన్‌ యూజర్‌ డేవిస్‌కు చేరింది.  

గ్లౌసెస్టర్‌షైర్‌కు చెందిన మిగ్గీ పీఎస్‌ తన కుటుంబ సభ్యులతో వై రివర్‌లో ప్రయాణిస్తుండగా తనకు ఐఫోన్‌ దొరికిందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సముద్రంలో దొరికి ఆఫోన్‌ను ఇంటికి వెళ్లి చెక్‌ చేయగా.. ఆఫోన్‌ పనితీరు చూసి ఆశ్చర్య పోయినట్లు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 

అంతే ఆ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అయ్యింది. యూకేకు చెందిన లోకల్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఆ లోకల్‌ గ్రూప్‌లో ఓ వ్యక్తి ఆ ఫోన్‌ తన స‍్నేహితుడు ఓవైన్‌ డేవిస్‌దేనని గుర్తించారు. ఫోన్‌కు సంబంధించిన సోషల్‌ మీడియా పోస్ట్‌ను డేవిస్‌కు షేర్‌ చేశాడు. దీంతో డెవిస్‌ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆధారాలు మిగ్గీ పీఎస్‌ చూపించడంతో కథ సుఖాంతం అయ్యింది.

మిగ్గీ పీఎస్‌..ఐఫోన్‌ యూజర్‌కు డేవిడ్‌కు చేరవేశాడు. ఈ సందర్భంగా డేవిడ్‌.. మిగ్గీ పీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పోయిన తన ఫోన్‌ను తనకు చేరవేసిన నెటిజన్లకు థ్యాంక్యూ చెప్పాడు. అయితే సముద్రంలో పోయిన ఫోన్‌ దొరకడం..అది చివరకు డేవిడ్‌కు చేరడం ఒకెత్తైతే... 10నెలలు దాటినా ఐఫోన్‌ పనిచేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అంతా బ్రాండ్‌ మహిమ. ఎలా అయితేనేం బ్రాండ్‌ బాబుకి ఫోన్‌ దొరికింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు