సేల్స్‌ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెక​ను లాభం రూ. 1.48 లక్షలు!

26 Nov, 2022 13:50 IST|Sakshi

ఇటీవల స్మార్ట్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో మొబైల్‌ రంగంలో కంపెనీలు అత్యధిక లాభాలు పొందుతున్నాయి. ఈ జాబితాలో టాప్‌ స్థానంలో కొనసాగుతున్న ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ లాభాల బాటలో దూపుకుపోతోంది. లాభాల విషయానికొస్తే ..యాపిల్ ప్రతి సెకనుకు ఎంత లాభం పొందుతుందో తెలుసా? ఇది $1,820 ( భారత కరెన్సీ ప్రకారం రూ. 1.48 లక్షలకు పైగా), రోజుకు సుమారు $157 మిలియన్ (రూ. 1,282 కోట్ల కంటే ఎక్కువ) ఆర్జిస్తోంది. 

తోటి టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృ సంస్థ), అలాగే వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే కూడా ప్రతి సెకనుకు వెయ్యి డాలర్లకు పైగా సంపాదిస్తున్నాయి. అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న టిపాల్టీ ఈ నివేదికను తయారు చేసింది.

యాపిల్‌ టాప్‌
రెండవ స్థానంలో, మైక్రోసాఫ్ట్ సెకనుకు సుమారు $1,404 (రూ. 1.14 లక్షలు), బెర్క్‌షైర్ హాత్వే సెకనుకు $1,348 (సుమారు రూ. 1.10 లక్షలు) సంపాదిస్తూ తర్వాతి వరుసలో ఉన్నాయి. ఆల్ఫాబెట్ నాల్గవ స్థానంలో సెకనుకు $1,277 సంపాదిస్తే, మెటా ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి సెకనుకు $924 లాభలను ఆర్జిస్తున్నాయి.  ఉబెర్‌ (Uber) టెక్నాలజీస్ 2021లో $6.8 బిలియన్ల భారీ నష్టాన్ని చవిచూసింది, ఇది ప్రతి సెకనుకు $215 నష్టంతో సమానం. ప్రపంచంలోనే అతిపెద్ద రైడ్-హెయిలింగ్ యాప్ అయినప్పటికీ, ఉబెర్‌ ప్రముఖంగా ఎప్పుడూ లాభాలను ఆర్జించలేదు. 

చదవండి: మాదాపూర్‌ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్‌ అక్కడ మొదలైంది!

మరిన్ని వార్తలు