భారత్‌లో భారీగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఇదే..

12 Feb, 2024 15:27 IST|Sakshi

ధర ఎక్కువైనప్పటికీ భారతీయ మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు డిమాండ్ భారీగానే ఉంది. గత అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రికార్డ్ సేల్స్ సాధించి, 7 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నట్లు కెనాలిస్ పరిశోధనలో వెల్లడైంది. ఇందులో కూడా అత్యధికంగా 15 సిరీస్ మోడళ్లకు గిరాకీ ఎక్కువ ఉన్నట్లు వెల్లడించింది.

గత త్రైమాసికంలో సులభ ఫైనాన్సింగ్ ఎంపికలు, రిటైలర్‌లకు ప్రోత్సాహక పథకాల కారణంగా.. పండుగ సీజన్లో అమ్మకాలు బాగా పెరిగాయి. అంతే కాకుండా గతేడాది ఐ15 సిరీస్ లాంచ్ అవ్వడంతో అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ మీద కూడా సంస్థ తగ్గింపులు ప్రకటించడంతో ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. 

యాపిల్ మొబైల్స్ అమ్మకాల తరువాత శాంసంగ్, షావోమి, వివో, రియల్‌మీ, ఒప్పో వంటి కంపెనీలు మంచి అమ్మకాలను పొందాయి. భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ల సంఖ్య 14.86 కోట్లు కావడం గమనార్హం. 

ఈ ఏడాది 5జీ పరికరాల ధరలు పెరుగుదల కారణంగా.. తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది. కానీ కెనాలిస్ అంచనా ప్రకారం ఈ ఏడాది కూడా అమ్మకాలు స్వల్ప వృద్ధిని నమోదు చేయవచ్చని తెలుస్తోంది. అయితే అమ్మకాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సిన విషయమే..

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega