ఐఫోన్లకు కొత్త అప్‌డేట్‌.. నయా ఫీచర్స్‌ భలే ఉన్నాయి!

31 Mar, 2023 10:53 IST|Sakshi

అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ యూజర్ల కోసం ఐవోఎస్‌  iOS 16.4 అప్‌డేట్‌ను విడుదల చేసింది.  తాజా అప్‌డేట్‌లో కొత్త ఎమోటికాన్‌ల (ఎమోజీ) సెట్, ఆడియో సపరేషన్‌, వెబ్‌సైట్ పుష్ అలర్ట్‌లు వంటి విభిన్న ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ అప్‌డేట్‌లో iPadOS 16.4, tvOS 16.4, macOS వెంచురా 13.3 కూడా ఉన్నాయి.

(వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్ష బరిలో ఆయనొక్కరే.. అజయ్‌ బంగా ఎన్నిక లాంఛనమే!)

కొత్త iOS అప్‌డేట్‌లో హ్యాండ్‌ గెశ్చర్స్‌, పింక్ హార్ట్, జెల్లీ ఫిష్, Wi-Fi చిహ్నంతో సహా మొత్తం 21 కొత్త ఎమోజీ చిహ్నాలు ఉన్నాయి. ఫోటోలకు సంబంధించి మరో ఫీచర్‌ కూడా ఈ అప్‌డేట్‌లో ఉంది.  దీని ద్వారా iCloud షేర్ ఫోటో లైబ్రరీలలో డూప్లికేట్‌ ఫోటోలు, వీడియోలను తీసివేయవచ్చు. సోనీ ప్లేస్టేషన్ 5 డ్యూయల్‌సెన్స్ ఎడ్జ్ కంట్రోలర్‌కు ఇన్‌బిల్ట్‌ సపోర్ట్‌తో పాటు ఐఫోన్ 14 సిరీస్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్‌కు కొత్త అప్‌డేట్‌లో​ మెరుగుదల చేశారు.

(ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు)

iOS 16.4లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే..

  • యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌ల ద్వారా ఫ్లాష్ లేదా లైట్‌ను గుర్తించినప్పుడు వీడియో ఆటోమేటిక్‌గా డిమ్‌ అవుతుంది.  
  • జంతువులు, హ్యాండ్‌ గెశ్చర్స్‌, ఆబ్జెక్ట్స్‌ వంటి 21 కొత్త ఎమోజీలు యాడ్‌ అయ్యాయి. వీటిని ఎమోజీ కీబోర్డ్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు
  • iCloud షేర్‌డ్‌ ఫోటో లైబ్రరీలో డూప్లికేట్‌ ఫోటోలు, వీడియోలను గుర్తించవచ్చు.
  • వాయిస్ ఐసోలేషన్‌తో మెరుగైన వాయిస్ కాల్ నాణ్యత, ఇది యూజర్‌ వాయిస్‌కు ప్రాధాన్యతనిచ్చి ఎక్స్‌టర్నల్‌ వాయిస్‌ను నిరోధిస్తుంది.
  • వాతావరణ యాప్ ద్వారా మ్యాప్‌ల కోసం వాయిస్ ఓవర్ సపోర్ట్‌ ఉంటుంది.
  • వెబ్ యాప్ నోటిఫికేషన్‌లను హోమ్ స్క్రీన్‌కి జోడించవచ్చు.
మరిన్ని వార్తలు