ఐఫోన్‌ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..!

20 Mar, 2022 08:45 IST|Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన ఐఓఎస్‌ అప్‌డేట్‌పై ఐఫోన్‌ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోన్‌లలో ఈ కొత్త ఐఓఎస్‌ను అప్ డేట్‌ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని యాపిల్‌కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. 

మార్చి 14న ఐఫోన్‌లలో యాపిల్‌ అట్టహాసంగా ఐఓఎస్ 15.4ను అప్డేట్ విడుదల చేసింది. లేటెస్ట్‌ ఐఓఎస్‌ వెర్షన్‌లో ఫీచర్లు బాగున్నా..పనితీరు బాగాలేదంటూ వినియోగదారులు యాపిల్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త ఐఓఎస్‌ దెబ్బకు ఐఫోన్‌ బ్యాటరీ డెడ్‌ అయ్యిందంటూ ట్వీట్‌లలో ప్రస్తావిస్తున్నారు.   

మ్యాగ్జిమ్‌ షిషాకో అనే ట్విట్టర్‌ యూజర్‌ ఐఓఎస్‌ 'ఐఓఎస్‌ 15.4 అప్‌డేట్‌ తర‍్వాత నా ఐఫోన్‌ బ్యాటరీ డెడ్‌ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

ఇప్పుడే ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌లో ఐఓఎస్‌ అప్‌డేట్‌ చేశా. ఇంతకు ముందు ఛార్జింగ్‌ పెడితే ఒకటి , లేదా రెండు రోజులు వినియోగించే వాడిని. కానీ ఇప్పుడు ఒక్కరోజు కాదు కదా.. సగం రోజులోనే ఫోన్‌ ఛార్జింగ్‌  అయిపోతుందని మరో యూజర్‌ తెలిపాడు. 

నా ఐఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టా. 95పర్సంటేజ్‌, 97పర్సంటేజ్‌ అని చూపించింది. ఛార్జింగ్‌ తీసేస్తే 100పర్సెంట్‌ చూపిస్తుంది. ఐదు నిమిషాల తర్వాత ఆటోమెటిగ్గా ఫోన్‌ రీస్టార్ట్‌ అవుతుంది.ఛార్జింగ్‌ ఎంత పర్సంటేజ్‌ ఉందో కూడా చూపించడం లేదని మండిపడ్డాడు. ఇలా మైక్రోబ్లాగింగ్‌లో ఐఫోన్‌ వినియోగదారులు యాపిల్‌ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్‌లు చేస్తుండగా.. ఐఫోన్‌ యూజర్లకు తలెత్తిన సాంకేతిక సమస్యలపై యాపిల్‌ సంస్థ ఇంత వరకూ స్పందించలేదు.  

చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్!

మరిన్ని వార్తలు