క్రికెట్ ప్రియుల కోసం ఎయిర్‌టెల్, జియో ప్రత్యేక ప్లాన్స్

9 Apr, 2021 16:48 IST|Sakshi

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఐపీఎల్ 2021 జరుపుకుంటున్న సందర్బంగా క్రికెట్ ప్రియుల కోసం ప్రత్యేక ప్లాన్స్ అందిస్తున్నాయి. ప్రత్యేక క్రికెట్ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్న యూజర్లకి ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను అందించడం కోసం డిస్నీ + హాట్‌స్టార్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్ మొదటి రోజున(ఏప్రిల్ 9) చెన్నై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(ఎంఐ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి)తో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మాత్రమే చూడటానికి అవకాశం ఉంది. మీరు కనుక ఎయిర్‌టెల్, జియో కస్టమర్ అయితే ఐపీఎల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా చూడవచ్చు. 

జియో క్రికెట్ ప్లాన్స్:
రూ.401 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద 28 రోజులకు 90జీబీ డేటాను పొందుతారు. దీనిలో రోజుకు 3జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. ఇవే కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు  కూడా పొందుతారు.
రూ.598 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. 56 రోజులు వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌కు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు. 
రూ.777 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద రోజుకు 1.5జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. మీరు 84 రోజుల పాటు మొత్తం 131జీబీ డేటాను పొందుతారు. ఇవే కాకుండా మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పొందవచ్చు.
రూ.2,599 ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌ కింద ఏడాది పాటు రోజుకు 2జీబీ డేటాతో పాటు 10జీబీ అదనపు డేటా లభిస్తుంది. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

జియోతో పాటు ఎయిర్‌టెల్ వినియోగదారులు కూడా రూ.401, రూ.448, రూ.599, రూ.2,698 రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్‌లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపీ ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అలాగే ఉచిత వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి.

చదవండి: బిలియనీర్ల అడ్డాగా బీజింగ్!

రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం ధర!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు