IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ఎవరిదో తెలుసా? 

30 May, 2023 17:49 IST|Sakshi

సాక్షి, ముంబై:  రెండు నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించిన  ఐపీఎల్‌ 2023 గుజ‌రాత్ టైటన్స్‌,  చెన్నై సూప‌ర్ కింగ్స్ మధ్య  సాగిన ఫైనల్‌ పోరుతో ముగిసింది.  ఎంస్‌ ధోనీ నేతృత్వంలోని సీఎస్‌కే టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఇది ఇలా ఉంటే  ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గి కీలక విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌ సీజన్‌లో ట్రోఫీ బిర్యానీ గెల్చుకుంది, బిర్యానీ  ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్‌ను గెలుచుకుంది అంటూ ట్విట్‌ చేసింది. 

 ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో  బిర్యానీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ తాజాగా ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్లు వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసింది బిర్యానీనే అని, 12 మిలియన్లకు పైగా ఆర్డర్స్ వచ్చాయని  పేర్కొంది.  ఆర్డర్ చేసిన ప్రతి వెజ్ బిర్యానీకి, దేశవ్యాప్తంగా 20 నాన్-వెజ్ బిర్యానీలే. తొలి మ్యాచ్ నుంచి గ్రాండ్ ఫినాలే వరకు టోర్నీలో కేవలం క్రికెటర్సే కాదు స్విగ్గీ యూజర్లు కూడా  నెక్ట్స్‌ లెవల్‌ అనిపించుకున్నారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌)

ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లు. ఇది కోల్‌కతాలో జరిగింది. ఈ క్రికెట్ సీజన్‌లో 12 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో ఫుడ్ లీడర్‌ బోర్డ్‌లో ఆధిపత్యం బెంగుళూరు  టాప్‌లో నిలిచింది.అలాగే ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారు ఈ సీజన్‌లో అత్యధికంగా 701 సమోసాలను ఆర్డర్ చేశారు. అత్యధిక సింగిల్ ఆర్డర్ రూ.26,474.

కాగా ఐపీఎల్ సీజన్ ఫీవర్‌ను క్యాష్‌ చేసుకున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ రకరకాల ట్వీట్లతో సందడి చేసింది. చిత్ర విచిత్ర కామెంట్లతో ట్విట్టర్ లో నెటిజన్లను ఆకర్షించింది. కొన్నింటిపై ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది.  ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా పదే పదే ఆగిపోతుండటంపై ‘అసలు ఆకాశంలో ఎవరు ఉల్లిగడ్డలు కోస్తున్నారబ్బా ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. (IPL 2023 విజేత, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?)

మరిన్ని బిజినెస్‌ వార్తలు కోసం చదవండి సాక్షి బిజినెస్‌ 

>
మరిన్ని వార్తలు