CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?

30 May, 2023 18:34 IST|Sakshi

ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను  దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్‌పై  ఘన విజయం సాధించింది. సీఎస్‌కే ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా చివరి ఓవర్లో   పది పరుగులు  కావాల్సిన సమయంలో వరుసగా సిక్స్‌,  ఫోర్ కొట్టి జట్టును ఛాంపియన్‌గా మార్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇండియ ఫస్ట్‌ స్పోర్ట్స్ యునికార్న్ ఎంటర్‌ప్రైజ్‌గా అవతరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా నిలిచిన జట్టుగా పేరొందిన సీఎస్‌కేకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.ఈ క్రమంలో  సీఎస్‌కే యాజమాని ఎవరు, పెట్టుబడి, నికర విలువ ఎంత అనేది విశేషంగా మారింది.  

ఎన్ శ్రీనివాసన్
సీఎస్‌కే టీం యజమాని, ప్రముఖ పారిశశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్. ఈయనకు క్రికెట్‌తో అనుబంధం చాలా సుదీర్ఘమైందే. అంతర్జాతీయ క్రికెట్ సర్క్యూట్‌లో పాపులర్‌ నేమ్‌.   పలు  నివేదికల ప్రకారం ప్రస్తుతం నికర నికర విలువ రూ.720 కోట్లుగా తెలుస్తోంది.   (IPL 2023 విజేత, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా?)

ప్రాథమిక విద్య
మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఎన్ శ్రీనివాసన్ చెన్నైలోని లయోలా  కాలేజీలో  గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) చేశారు. అమెరికాలోని  ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్  ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. (ఐపీఎల్‌ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్‌ నెట్‌వర్త్‌ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు)

క్రికెట్ పరిచయం
బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన తర్వాత, శ్రీనివాసన్ 2011లో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. 2014లో శ్రీనివాసన్  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ ఎంపిక కావడంతో జగ్మోహన్ దాల్మియా నియమితులయ్యారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్. 2008 సంవత్సరంలో సీఎస్‌కేను కొనుగోలు చేశారు. దేశంలోని సిమెంట్ పరిశ్రమలో పాపులర్‌ అయిన  ఇండియా సిమెంట్ ఓనర్‌ కూడా. బీసీసీఐ చీఫ్‌గా , ఐసీసీ మాజీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్‌ సూపర్‌ పిక్స్‌ వైరల్‌)

చెన్నై సూపర్ కింగ్స్  కొనుగోలు
శ్రీనివాసన్ 2008లో చెన్నై ఫ్రాంచైజీని (చెన్నై సూపర్ కింగ్స్) సుమారు రూ. 752 కోట్లకు కొనుగోలు చేయడంతో జెంటిల్‌మన్ గేమ్‌తో  ఆయన రిలేషన్‌ మరింత  బలపడింది. ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు దాదాపు సుమారు రూ. 7443 కోట్లుగా ఉంది. 

ప్రొఫెషనల్ జర్నీ
చెన్నైకి చెందిన సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్‌కి కో ఫౌండర్‌ తండ్రి నారాయణస్వామి తరువాత 1989లో శ్రీనివాసన్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా  బాధ్యతలను స్వీకరించారు. బొగ్గు ,ముడిసరుకు ధరలపెరుగుదల కారణంగా మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ.218 కోట్ల నష్టాన్ని నివేదించింది.

ఈక్రమంలోనే తిరునెల్వేలిలో 600 ఎకరాల భూమిని డబ్బు ఆర్జించే దిశగా సంస్థ ఉందని, ఈ ఏడాది (2023)వడ్డీతో సహా రూ. 500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని భావిస్తున్నట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐపీఎల్‌ విజేతగా నిలివడంతో మార్కెట్లో ఇండియా సిమెంట్స్‌ షేర్‌  3 శాతం లాభపడి. 199.50 వద్ద ముగిసింది.

 ఇలాంటి ఇంట్రస్టింగ్‌ వార్తలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షి బిజినెస్‌ 

మరిన్ని వార్తలు