చౌక వడ్డీకే ఐపీపీబీ గృహ రుణాలు.. ఎంతంటే?

9 Sep, 2021 15:48 IST|Sakshi

డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) తన 4.5 కోట్ల మంది ఖాతాదారులకు తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందించనున్నట్లు ప్రకటించింది. వేతన జీవులకు రూ.50 లక్షల వరకు అందించే గృహ రుణాలపై వడ్డీ రేటు 6.66 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ రేటు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్, ఐపీపీబీ పేర్కొన్నాయి. (చదవండి: దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్స్‌)

దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలు, 136,000కు పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లతో విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉన్నట్లు ఐపీపీబీ తెలిపింది. ఐపీపీబీ, ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణాలు పాన్-ఇండియా మొత్తం అందుబాటులో ఉంటాయి. అవగాహనపూర్వక ఒప్పందం(ఎమ్ఒయు)లో భాగంగా.. అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్ అండర్ రైటింగ్, ప్రాసెసింగ్ బాధ్యతలు చేపట్టే ఐపీపీబీ చేత ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ నిర్వహిస్తుంది. ఐపీపీబీ తన ఆన్ గ్రౌండ్ వర్క్ ఫోర్స్ 200,000 పోస్టల్ ఉద్యోగులు(పోస్ట్ మెన్, గ్రామీణ్ డక్ సేవకులు) ద్వారా మైక్రో ఎటిఎమ్, బయోమెట్రిక్ సేవాలు, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తుంది. ఈ విస్తృతమైన నెట్ వర్క్ ద్వారా విభిన్న ప్రజలకు ఎల్ఐసీ హౌసింగ్ రుణాలను చేరడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది అని ఐపీపీబీ తెలిపింది.

మరిన్ని వార్తలు