బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్‌ చేసిన ఈ ఫోన్‌ అదరహో...!

26 Apr, 2021 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్‌ వివోకు చెందిన ఐక్యూ మొబైల్స్‌ తాజాగా మరో రెండు మోడల్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్‌​ బ్రాండ్‌ తొలుత ఐక్యూ నియో 5ను రిలీజ్‌ చేయగా, దానినే రిబ్రాండ్‌ చేస్తూ ఐక్యూ 7గా రిలీజ్‌ చేసింది. దాంతో పాటుగా ఐక్యూ 7 లెజెండ్‌ను భారత విపణిలోకి లాంచ్‌ చేసింది. ఐక్యూ 7 లెజెండ్‌ మొబైల్‌ను ప్రముఖ మోటార్‌స్పోర్ట్‌ కంపెనీ బీఎమ్‌డబ్యూ భాగస్వామ్యంతో డిజైన్‌ చేసింది. ఐక్యూ 7, ఐక్యూ 7 లెజెండ్‌ ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలను కల్గి ఉన్నాయి. దాంతో పాటుగా 66వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. కాగా ఐక్యూ 7, ఎమ్‌ఐ 11 ఎక్స్‌తో పోటీ పడుతుండగా, ఐక్యూ 7 లెజెండ్ ఎమ్‌ఐ 11 ఎక్స్ ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్ ఫోన్లకు సరితూగుతుంది. ఐక్యూ 7 స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్‌లో లభిస్తుంది. 

ఐక్యూ 7 ధరలు:

  • (8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 31,990
  • (8జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 33,990
  • (12జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 35,990


ఐక్యూ 7  ఫీచర్లు

  • 6.62 అంగుళాల స్క్రీన్‌
  • 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్
  • 16  ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 48+ 13+2-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా
  • 8జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌
  • 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

ఐక్యూ 7 లెజెండ్‌ ధరలు

  • (8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 39,990
  • (12జీబీ ర్యామ్‌+256 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ ధర రూ. 43,990

ఐక్యూ 7 లెజెండ్‌  ఫీచర్లు

  • 6.62 అంగుళాల స్క్రీన్‌
  • 1080x2400 పిక్సెళ్ల రిజల్యూషన్‌
  • ఆండ్రాయిడ్‌ 11
  • క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్
  • 16  ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 48+ 13+13-మెగాపిక్సెల్ రియర్‌కెమెరా
  • 8జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌
  • 4400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

చదవండి: రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ : సరసమైన ధరలో

మరిన్ని వార్తలు