బడ్జెట్‌లో మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌

27 Sep, 2021 15:30 IST|Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో సబ్‌ బ్రాండ్‌ ఐక్యూ చైనాలో ఆవిష్కరించిన తన జెడ్‌5 స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్​డ్రాగన్​ 778జీ ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐక్యూ జెడ్5 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేసి వస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. (చదవండి: పది సెకండ్ల యాడ్‌కు 18 లక్షలే....!)

ఐక్యూ జడ్5 ధర 
భారతదేశంలో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఐక్యూ జడ్5 రూ.23,990కి లభిస్తే, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.26,990 ఉంది. ఇది ఆర్కిటిక్ డాన్, మిస్టిక్ స్పేస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో(iQoo.com, Amazon.in) అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్ కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్/క్రెడిట్, ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

ఐక్యూ జెడ్‌5 స్పెసిఫికేషన్‌లు

  • 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD డిస్ ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 120హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌
  • 8 జీబీ/12 జీబీ ర్యామ్‌, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 64 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
  • 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  • 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
  • హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సపోర్ట్‌
  • 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.23,990
  • 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.26,990
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు