ఐకూ జెడ్‌ 5జీ విడుదల

27 Mar, 2023 04:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐకూ జెడ్‌ 7 5జీ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇది రెండు వేరియంట్లుగా విడుదలైంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.18,999. ఆరంభ డిస్కౌంట్‌ పోను రూ.17,499కు లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ ధర రూ.19,999. డిస్కౌంట్‌ పోను రూ.18,499కు సొంతం చేసుకోవచ్చు.

నార్వే బ్లూ, పసిఫిక్‌ నైట్‌ రంగుల్లో లభిస్తుంది. అమెజాన్, ఐకూ వెబ్‌సైట్లలో లభిస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్‌ 7.8 ఎఎం మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్స్‌ ఓఐఎస్‌ అల్ట్రా స్టెబుల్‌ కెమెరా, అమోలెడ్‌ స్క్రీన్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌  ప్రధాన ఆకర్షణలు. 44 వాట్‌ ఫ్లాష్‌ చార్జర్‌ సదుపాయం ఉంది.

మరిన్ని వార్తలు