ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా

10 Jan, 2023 20:36 IST|Sakshi

సాక్షి,ముంబై:  ఐకూ 11 5జీ  పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. ప్రీమియం ఫీచర్లతో 2023లో తొలి ఫ్లాగ్‍షిప్ మొబైల్‌గా మంగళవారం (జనవరి10)  ఆవిష్కరించింది.  స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 (Snapdragon 8 Gen 2) ప్రాసెసర్‌, 2K  ఈ6 అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఇండియాలో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదేనని ఐకూ  తెలిపింది.   రాత్రిపూట 4K వీడియోలను రికార్డ్ చేసేలా వివో V2 ఇమేజింగ్ చిప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  ఈ ఫోన్ ఎనిమిది నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్  అవుతుందని కంపెనీ పేర్కొంది. 

p>


ఐకూ 11 5జీ స్పెసిఫికేషన్స్‌
 6.7 ఇంచుల 2K  ఈ6 అమోలెడ్‌ డిస్‍ప్లే
హెచ్‍డీఆర్10+, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ 
50+8 +13 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌  కెమెరా 
16 ఎంపీ  సెల్ఫీ కెమెరా  
5000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్

ఐకూ 11 5జీ ధరలు, తొలిసేల్
ఐకూ 11 5జీ బేస్ మోడల్, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్  వేరియంట్‌   ధర రూ.59,999. టాప్ వేరియంట్, 16జీబీ  ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  ధర రూ.64,999గా ఉంది.
జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు  అమెజాన్, ఐకూ అధికారిక వెబ్‍సైట్‌ ద్వారా ఫస్ట్‌ సేల్‌ ప్రారంభం.   ఆల్ఫా, లెజెండ్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం.

ఆఫర్లు 
ఐసీఐసీఐ, హెచ్‍డీఎఫ్‍సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఐకూ 11 5జీని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే  నో కాస్ట్ ఈఎంఐ,  3 వేల రూపాయల దాకా స్పెషల్‌  ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో  ఉంటాయి. 

మరిన్ని వార్తలు