భారత్‌ కేంద్రంగా ఇరాన్ హ్యాకర్లు భారీ కుట్ర.. టెక్ దిగ్గజాలను హెచ్చరించిన మైక్రోసాఫ్ట్!

19 Nov, 2021 20:54 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొంత కాలం క్రితం చైనా హ్యాకర్లు ఇండియాలోని కొన్ని సంస్థలు హ్యాక్ చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఇరాన్ హ్యాకర్లు భారతదేశంలోని ఐటీ సేవల సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఐటీ సంస్థలను హెచ్చరించింది. జూలై 2021కి ముందు దేశంలో ఉన్న చిన్న కంపెనీలను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు ఇప్పుడు టెక్ దిగ్గజ కంపెనీలను సిద్దం అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే దాడుల సంఖ్య రోజు రోజుకి పెరుగతున్నట్లు తెలిపింది. 

2021లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న 40 కంటే ఎక్కువ ఐటీ కంపెనీలకు 1,600 నోటిఫికేషన్‌లను జారీ చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 2020లో కంపెనీ జారీ చేసిన 48 నోటిఫికేషన్‌ల కంటే ఇది చాలా ఎక్కువ. “ఇరానియన్ హ్యాకర్లు దృష్టి ముఖ్యంగా గత ఆరు నెలల్లో పుంజుకున్న ఐటీ రంగం మీద ఉంది. మా నోటిఫికేషన్‌లలో దాదాపు 10-13% గత ఆరు నెలల్లో ఇరాన్ హ్యాకర్లకు సంబంధించినవే. అంతకు ముందు ఆరు నెలల్లోని రెండున్నర శాతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ” అని కంపెనీ తెలిపింది.

(చదవండి: ఎలన్‌ మస్క్‌ ఆపసోపాలు, టిమ్‌ కుక్‌ అప్పుడే ప్రకటించేశాడు..?!)

టెక్ దిగ్గజాలపై సైబర్ దాడులు
ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో పాటు భారతదేశంలోని టెక్నాలజీ దిగ్గజ ఐటీ సంస్థలపై "ఎక్కువగా దృష్టి" సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు మధ్యకాలంలో ఇరానియన్ హ్యాకర్లు భారతదేశంలోని కంపెనీలతో రాజీ చేసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సెంటర్, మైక్రోసాఫ్ట్ డీజిటల్ సెక్యూరిటీ యూనిట్ పేర్కొంది. ఇతర దేశాల అనుబంధ సంస్థలు, ఖాతాదారుల ఖాతాలను పరోక్షంగా అనుమతి పొందడం కోసం భారతీయ ఐటీ సంస్థలపై ఆకస్మిక దాడులకు చేసేందుకు సిద్దం అయినట్లు కంపెనీ ఊహించింది. భారతీయ ఐటీ సంస్థలు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను కల్పిస్తాయి. 

భారీగా మొబైల్ దాడులు
"ఇటువంటి దాడులు ముఖ్యంగా వారికి లాభదాయకంగా ఉంటాయి. దాడి చేసేవారికి ఈ డేటా చాలా విలువైనది, ఎందుకంటే పెద్ద సంఖ్యలో వినియోగదారుల ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీల మీద దాడులు చేసే అవకాశం ఉన్నట్లు" అని భద్రతా సంస్థ కాస్పెర్స్‌కీ ఈ వారం ప్రారంభంలో ఒక నివేదికలో తెలిపింది. "అలాగే, రికార్డు స్థాయి సైబర్-దాడులతో ప్రపంచంలో అలజడి సృష్టించవచ్చు, ఎక్కువ సంఖ్యలో రాన్సమ్ వేర్ మొబైల్ దాడుల జరగవచ్చు" అని భద్రతా సంస్థ చెక్‌పాయింట్ రీసెర్చ్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మాయా హోరోవిట్జ్ అన్నారు.

(చదవండి: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!)

మరిన్ని వార్తలు