రైలు ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్త!

20 Jun, 2021 14:55 IST|Sakshi

రైలు ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్త అందించింది. ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్, యాప్ లో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఐఆర్​సీటీసీ చెల్లింపు గేట్ వే ఐఆర్​సీటీసీ-ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్​సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది.

ఐఆర్​సీటీసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఐఆర్​సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని, దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు.

చదవండి: ఆధార్ కార్డులో చిరునామాని ఆన్‌లైన్‌లో సవరించండి ఇలా!

మరిన్ని వార్తలు