IRCTC Voice-Based E-Ticket: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌, ఇక ఆ అవసరమే లేదు!

9 Mar, 2023 13:32 IST|Sakshi

సాక్షి, ముంబై: రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన  వినియోగ దారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆన్‌లైన​ టికెంట్‌ బుకింగ్‌ పద్ధతిని మరింత సులువు చేయనుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ వాయిస్‌ సెంట్రిక్‌ ఈ-టికెటింగ్‌ ఫీచర్‌ను  త్వరలోనే ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టనుంది. తాజా నివేదికల ప్రకారం తొలి దశ టెస్టింగ్‌ విజయవంతమైంది. 

ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇకపై ఐఆర్‌సీటీసీ లాగిన్‌ కావడానికి ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీలతో పనిలేకుండానే, కేవలం వాయిస్‌ ద్వారా రైలు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వివరాలు ఇవ్వడానికి బదులుగా, Actually అని చెబితే సరిపోతుంది. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో AskDisha (డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం)పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలు విజయవంతం కావడంతో మలి దశ టెస్టింగ్‌ను మరింత వేగవంతం చేయనుంది. ఈ ఫీచర్‌ను వచ్చే 3 నెలల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా  ఐఆర్‌సీటీసీ  బ్యాకెండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌మెరుగ వుతుందని  భావిస్తున్నారు.

ఆస్క్‌ దిశ 2.0 ఫీచర్‌  రైలు ప్రయాణానికి సంబంధించి కస్టమర్లకు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. వీటిని హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను స్టార్ట్‌ చేయాలి. ఈ ఫీచర్‌ ద్వారా కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసిన టికెట్ల  నగదు రీఫండ్‌ స్థితిని, పీఎన్‌ఎర్‌ స్టేటస్‌ను కూడా చూడవచ్చు.అంతేకాదు ప్రయాణికులు బోర్డింగ్‌ లేదా డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు. రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చని తెలుస్తోంది. నిజానికి ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగం గత ఏడాది మార్చిలోనే  ఈ ఫీచర్‌ గురించి ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా వెబ్‌సైట్‌లో   పొందుపర్చింది. 

>
మరిన్ని వార్తలు