బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ కీలక ఆదేశాలు

24 Nov, 2022 12:29 IST|Sakshi

డాక్టర్ల నెట్‌వర్క్‌  ఏర్పాటు చేసుకోవాలి 

న్యూఢిల్లీ: ఔట్‌ పేషెంట్‌ (ఓపీడీ), ఇతర సేవలను అందించేందుకు డాక్టర్ల నెట్‌వర్క్‌ లేదా ఇతర ఆరోగ్య రంగ నిపుణులతో రిజిస్ట్రీ ఏర్పాటు చేసుకోవాలని.. బీమా కంపెనీలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) కోరింది. ‘‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కింద నేషనల్‌ హెల్త్‌ అథారిటీ ‘ఆరోగ్య సంరక్షణ నిపుణుల రిజిస్ట్రీ’ (హెచ్‌పీఆర్‌)ని ఏర్పాటు చేసింది.

ఇందులో నమోదిత డాక్టర్లు, ఇతర ఆరోగ్య రంగ నిపుణుల వివరాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆధునిక, సంప్రదాయ ఆరోగ్య సేవలను అందించేందుకు ఇది సాయపడుతుంది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సైతం పాలసీదారులకు ఓపీడీ, ఇతర సేవలు అందించేందుకు వీలుగా.. ఈ హెచ్‌పీఆర్‌ సాయంతో డాక్టర్లు/ఫిజీషియన్లు లేదా ఆరోగ్య రంగ నిపుణులతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి’’అని ఐఆర్‌డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. మెడికల్‌ ప్రాక్టీషనర్ల గుర్తింపు, ధ్రువీకరణకు హెచ్‌పీఆర్‌ ఐడీని ఉపయోగించుకోవాలని సూచించింది.    

>
మరిన్ని వార్తలు