Instagram: భారీ జరిమానా..షాకింగ్‌! ఎందుకో తెలుసా?

6 Sep, 2022 13:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ (మెటా) సొంతమైన సోషల్‌ మీడియా నెట్‌వర్కింగ్‌ సైట్‌  ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్‌  తగిలింది. తన టీనేజ్‌ యూజర్ల గోప్యతా  నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఐర్లాండ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల (402 మిలియన్డ డాలర్ల) జరిమానా విధించింది. 

ఇది చదవండి: Hyundai Venue N Line: వెన్యూ ఎన్ లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్‌ యూజర్ల డేటాపై నిబంధనలు  పాటించలేదని తేల్చింది. పిల్లల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్‌   నిబంధనలను  ఉల్లంఘించిందని  డేటా ప్రొటెక్షన్ కమిషన్‌ ఆరోపించింది. నివేదికల ప్రకారం  దాదాపు 32 బిలియన్.. 17 కోట్ల 44 లక్షల 15 వేల రూపాయలుగా ఉంటుంది. 

ఇదీ క్లిక్‌ చేయండి: హాప్‌ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్‌: అదిరే..అదిరే..!

ఈ రికార్డు జరిమానాపై అప్పీల్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్  యోచిస్తోందని పేరెంట్ మెటా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్  గత ఏడాది తన సెట్టింగ్‌లను అప్‌డేట్ చేసిందన్నారు. ముఖ్యంగా టీనేజర్ల వ్యక్తిగత డేటా సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంచడానికి కొత్త ఫీచర్లను లాంచ్‌ చేసినట్టు మెటా ప్రతినిధి తెలిపారు. ఈ జరిమానాతో విభేదిస్తున్నామనీ దీన్ని  జాగ్రత్తగా సమీక్షిస్తున్నట్లు  తెలిపారు.

మరిన్ని వార్తలు