వాట్సాప్‌కు ఐర్లాండ్‌ భారీ షాక్‌...!

2 Sep, 2021 19:44 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు భారీ షాక్ తగిలింది. ఇతర ఫేస్‌బుక్ కంపెనీలతో వ్యక్తిగత డేటాను షేర్ చేసుకున్న నేపథ్యంలో వాట్సాప్‌పై ఐర్లాండ్ 225 మిలియన్ యూరో (సుమారు రూ.1,950 కోట్లు) జరిమానాను విధించింది. భారీ స్థాయిలో జరిమానా వేయడాన్ని తప్పుబట్టిన వాట్సాప్‌ తాము అప్పీల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఫేస్‌బుక్ ఇతర కంపెనీలతో వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలకు విరుద్దంగా పంచుకోవడంతో ఈ జరిమానా విధించినట్లు ఐర్లాండ్ డీపీసీ పేర్కొంది.

వాట్సాప్ తన వినియోగదారులకు డేటా ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించిందని ఐరిష్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అంశంపై 2018లో విచారణ ప్రారంభించి తాజాగా జరిమానా విధించింది. టెక్ దిగ్గజాలు నిబంధనలకు విరుద్దంగా తీసుకున్న నిర్ణయాలను విచారించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం, తగినంత ఫైన్ వేయనందుకు ఇతర యూరోపియన్ రెగ్యులేటర్లు గతంలో డీపీసీని విమర్శించారు.(చదవండి: ఈ-నామినేషన్ ఫైల్ చేశారా.. లేకపోతే రూ.7 లక్షలు రానట్లే?)

మరిన్ని వార్తలు