కూతురికి అరుదైన గౌరవం - ఆనందంలో ముకేశ్ అంబానీ..

18 Feb, 2024 20:44 IST|Sakshi

రిలయన్స్ గ్రూప్ రిటైల్ వెంచర్ 'రిలయన్స్ రిటైల్‌'కు నాయకత్వం వహిస్తున్న 'ఇషా అంబానీ' (Isha Ambani), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఆమెను ఇటీవల 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డు వరించింది.

రిలయన్స్ రిటైల్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో 'ఇషా అంబానీ' పాత్ర అనన్యసామాన్యం. ఈమెకు ఫిబ్రవరి 15న ఓ వార్తాపత్రిక వార్షిక కార్యక్రమంలో 2024 సంవత్సరపు మహారాష్ట్ర ప్రత్యేక అవార్డును గెలుచుకుంది.

అవార్డు గెలుచుకున్న సందర్భంలో ఇషా అంబానీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర కేవలం మాకు ఉంటున్న ప్రదేశం (ఇల్లు) మాత్రమే కాదు, ఇది మాకు కర్మభూమి. మా తాత 'కలలు కనడానికి ధైర్యం చేయండి, వాటిని సాధించడం నేర్చుకోండి' అని చెప్పేవారు, ఆ మాటలనే అనుసరిస్తూ నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. మా నాన్న కష్టపడి ఎలా పనిచేయాలో చూపించి, ఎంతోమందికి ఆదర్శమయ్యారు.

అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె రిలయన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు మొత్తం రిలయన్స్ కుటుంబానికి చెందినదిని వెల్లడించింది. 

యేల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇషా ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈమె ఇప్పటికే ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్స్ 2023లో GenNext ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును కూడా అందుకుంది.

ఇదీ చదవండి: హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి

whatsapp channel

మరిన్ని వార్తలు