చిన్నప్పుడే ఆ ఉద్యోగంపై మనసుపడిన ఇషా అంబానీ.. మీకు తెలుసా?

11 Mar, 2023 14:07 IST|Sakshi

అపరకుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త 'ముఖేష్ అంబానీ' గురించి గానీ, వారి కుటుంబం గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి కొంతమందికి తెలియకపోవచ్చు. చిన్నప్పుడు టీచర్ కావాలని కలలు కన్న ఈమె ఈ రోజు ఫ్యాషన్ ప్లాట్‌ఫారమ్ AJIO బోర్డులో మేనేజింగ్ డైరెక్టర్ స్థానంలో కూర్చుంది.

ఇషా అంబానీ 1991 అక్టోబర్ 23న జన్మించింది. ఈమె ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. వీరికి ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు, అనంత్ అంబానీకి ఇటీవల రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది.

ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పాఠశాల విద్యను ప్రారంభించిన ఇషా అంబానీ అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.

(ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫిట్స్)

23 సంవత్సరాల వయసులో తండ్రి వ్యాపారంలో చేరిన ఇషా 2020లో రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో బోర్డులలో ఒకరుగా నిలిచింది. ఆ తరువాత ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుని, ఈ రోజు ఇషా అంబానీ ముంబైలో 450 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలో నివసిస్తున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు