పేద దేశమైనా సుడాన్‌ సూపరహే.. చైనా-భారత్‌కు నో టాప్‌ప్లేస్‌!

31 Jul, 2021 11:02 IST|Sakshi

Cheapest Mobile Data Countries:దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ యూసేజ్‌ బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. అయితే ఒక గిగాబైట్‌ (జీబీ) డేటా ఉపయోగించినందుకు ఇండియన్లు చేస్తున్న ఖర్చు ఎంత ? అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు ఏవీ ? అనే అంశాలపై 221 రీజియన్లలో 6,148 మొబైల్‌ డేటా ప్లాన్లు పరిశీలించి తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి.

డేటా విప్లవం
మార్కెట్‌లోకి జియో నెట్‌వర్క్‌ రాకముందు దేశంలో నెట్‌ వినియోగం ఖరీదైన వ్యవహరంగానే ఉండేంది. దాదాపు సర్వీస్‌ ప్రొవైడర్లు అందరూ 1 జీబీ డేటాకు రూ. 200లకు పైగానే ఛార్జ్‌ చేశారు. అయితే 2016లో జియో వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతి తక్కువ ధరకే అపరిమితమైన డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఒక్కసారిగా సోషల్‌ మీడియా విస్త్రృతమైంది. వీడియో కంటెంట్‌ వాడకం పెరిగి పోయింది. జియో ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు డేటా ప్లాన్స్‌ని తగ్గించాయి. మరోవైపు జియో క్రమంగా తన ప్లాన్ల రేట్లు పెంచుతూ పోయింది. 

ఇండియాలో రూ.50
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిద నెట్‌వర్క్‌లు అందిస్తున్న ప్లాన్లను పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక జీబీ డేటాను వినియోగించేందుకు రూ. 50 ఖర్చు పెడుతున్నారు భారతీయులు, ఇదే సమయంలో పొరుగున్న ఉన్న శ్రీలంక రూ. 28, బంగ్లాదేశ్‌ రూ.25వరకు ఖర్చు వస్తోంది. ఇండియాలో పోల్చితే శ్రీలంక, బంగ్లాదేశలలోనే డేటా ప్లాన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

ఇజ్రాయిల్‌ నెంబర్‌ వన్‌
మరో ఆసియా దేశమైన ఇజ్రాయిల్‌లో ఇంటర్నెట్‌ డేటా రేట్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి,.  ఇజ్రాయిల్‌ ప్రజలు వన్‌ జీబీ డేటా కోసం రీఛార్జ్‌పై చేస్తున్న ఖర్చు కేవలం రూ.3 మాత్రమే.ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందిస్తున్న దేశంతా ఇజ్రాయిల్‌ రికార్డ్‌ సృష్టించింది. ఆ తర్వాత కిర్కిజిస్తాన్‌ రూ. 13, ఫిజీ రూ. 18, ఇటలీ రూ, 20. సుడాన్‌ రూ, 20, రష్యా రూ. 21, మోల్డోవా దీవీ రూ. 23, చీలీలో రూ. 29 వంతున ఒక జీబీ డేటాపై ఛార్జ్‌ చేస్తున్నారు.

తక్కువ ఛార్జీలు వసులూ చేస్తున్న ఇంటర్నెట్‌ డేటా అందిస్తోన్న టాప్‌ టెన్‌ దేశాల్లో  అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్‌లతో పాటు టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే అమెరికాలకు స్థానం దక్కలేదు. అత్యంత పేద దేశమైన సుడాన్‌ అగ్ర రాజ్యాలకంటే తక్కువ ధరకే నెట్‌ అందిస్తోంది. సుడాన్‌లో టెలికాం కంపెనీలు 1 జీబీ డేటాకు సగటున రూ.20 వసూలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు