చివరికి 39,000కు- ఆటో, ఐటీ దన్ను

2 Sep, 2020 16:01 IST|Sakshi

185 పాయింట్లు పెరిగి 39,086కు చేరిన సెన్సెక్స్‌

65 పాయింట్లు బలపడి 11,535 వద్ద నిలిచిన నిఫ్టీ 

ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ఆటో, ఐటీ, మెటల్ అప్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లకు డిమాండ్

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 185 పాయింట్లు బలపడి 39,086 వద్ద నిలవగా.. నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుని 11,535 వద్ద స్థిరపడింది. సోమవారంనాటి భారీ పతనం నుంచి మార్కెట్లు మంగళవారం కోలుకున్నప్పటికీ తీవ్ర ఆటుపోట్లను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా నేటి ట్రేడింగ్‌లోనూ ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,142 వద్ద గరిష్టాన్ని తాకగా.. 38,736 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక నిఫ్టీ సైతం 11,555- 11,430 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. చైనాతో సరిహద్దు వద్ద వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ప్రభుత్వ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, మెటల్, ఐటీ, ఆటో 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ సైతం 0.8-0.4 శాతం మధ్య  పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ 0.2 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 7.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో  బజాజ్‌ ఆటో, హీరో మోటో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, సన్‌ ఫార్మా, హెచ్‌యూఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, ఎన్టీపీసీ, యూపీఎల్‌ 2.4-0.6 శాతం మధ్య డీలాపడ్దాయి.

ఐడియా జోరు
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా 12.5 శాతం దూసుకెళ్లగా.. ఎస్కార్ట్స్‌, యూబీఎల్‌, నౌకరీ, మైండ్‌ట్రీ, బాష్‌, సెయిల్‌, బంధన్‌ బ్యాంక్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఇండిగో, జీఎంఆర్‌, సీఫోర్జ్‌ 10-3.5 శాతం మధ్య దూకుడు చూపాయి. కాగా.. మరోపక్క శ్రీరామ్‌ ట్రాన్స్‌, కంకార్‌, పెట్రోనెట్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌, బాలకృష్ణ, ఐబీ హౌసింగ్‌, పీఎఫ్‌సీ, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.25-1.7 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1631 లాభపడగా.. 1051 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 486 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 775 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే.  

మరిన్ని వార్తలు