బంప‌రాఫ‌ర్!! మీ కోస‌మే..ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఊహించ‌ని శాల‌రీలు!!

21 Feb, 2022 12:59 IST|Sakshi

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌!! అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగుల‌కు భారీ ఎత్తున శాల‌రీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని, త‌ద్వారా క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో ఫ్రెష‌ర్ల‌కు ఊహించిన జీతాల కంటే ఎక్కువ‌గా శాల‌రీలు పొంద‌వ‌చ్చని ప‌లు నివేదిక‌లు వెలుగులోకి వ‌చ్చాయి.      

ఐటీ కంపెనీల‌కు వ‌చ్చి ప‌డుతున్న ప్రాజెక్ట్‌లు, ఐటీ కంపెనీల్లో మిడ్, సీనియర్ స్థాయి విభాగాల్లో పెరుగుతున్న అట్రిషన్‌ల కార‌ణంగా టెక్ విభాగంలో రికార్డ్ స్థాయిలో ఉద్యోగ అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన రిపోర్ట్‌లు పేర్కొన్నాయి.    

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, క్యాప్‌జెమినితో సహా ఐటి కంపెనీలు 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2.3 లక్షల మంది కొత్త‌గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన విద్యార్ధుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాయి. ప్ర‌స్తుతం ఈ నియామ‌కం రికార్డ్ స్థాయిలో ఉండ‌గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో టెక్ కంపెనీలు నియామకాల్ని మ‌రింత  పెంచేలా ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.  

రీసెర్చ్ సంస్థ అన్‌ఎర్త్ ఇన్‌సైట్ ఇటీవలి నివేదికలో 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐటీ కంపెనీలు ఫ్రెష‌ర్ల నియామకాలు 3.5 నుంచి  3.6 లక్షలకు పెంచ‌నున్నాయి.

మరిన్ని వార్తలు