రిటర్న్‌ల స్క్రూటినీకి మార్గదర్శకాలు

13 May, 2022 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నులను స్క్రూటినీకి ఎంపిక చేసే విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది.  వీటి ప్రకారం పన్ను ఎగవేతకు సంబంధించి ఏ అధికారిక ఏజెన్సీల దగ్గర సమాచారమున్నా స్క్రూటినీ చేపట్టవచ్చు. అయితే, పూర్తి స్థాయి పరీక్షకు నిర్దిష్ట కేసులను ఎంపిక చేసేందుకు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ / ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ / కమిషనర్‌ / డైరెక్టర్‌ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఉదాహరణకు చెల్లుబాటయ్యే అనుమతులు లేకుండా చారిటబుల్‌ ట్రస్టులు మినహాయింపులను క్లెయిమ్‌ చేసిన కేసుల్లో.. సర్వే, సెర్చి, జప్తులకు సంబంధించిన కేసుల్లో.. నోటీసుల జారీ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. పూర్తి స్థాయి స్క్రూటినీలో భాగంగా పన్ను చెల్లింపుదారులు నిజాయితీగానే మినహాయింపులు పొందారా అన్నది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆదాయం తక్కువగా, నష్టాలను ఎక్కువగా చూపడం లాంటివేవీ చేయలేదని ధృవీకరించుకునేందుకు స్క్రూటినీ నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు