గ్రామాలలోకి టెకీల జీవన విధానం..

11 Sep, 2020 19:47 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ ఉదృతి నేపథ్యంలో మెజారిటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌(ఇంటి నుంచే పని) వెసలుబాటు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు తమ గ్రామాలకు చేరుకున్నారు. అయితే సిటీ కల్చర్‌కు అలవాటు పడిన టెకీలు గ్రామీణ జీవన విధానానికి అలవాటు పడలేకపోతున్నారు. అయితే భారీ వేతనాలు పొందుతున్న టెకీలు తమ గ్రామాలలోనే అత్యాధునిక సౌకర్యాలు కల్పించుకోవడానికి ప్రాధాన్యతిస్తున్నారు. 

స్టార్ట్‌టీవీ, ఆఫీస్‌లో ఉన్న విధంగా గోడలకు సీలింగ్‌ చేయించడం, ఉన్నంతలో కాన్పరెన్స్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ అంశంపై సికెందర్‌ అనె టెకీ స్పందిస్తూ.. తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని ఐటీలో వంద శాతం నైపుణ్యత కావాలంటే కచ్చితంగా కెఫీన్‌ కలిగిన కాఫీ ఉండాల్సిందేనని తెలిపారు. అయితే మెజారిటీ టెకీలు నగరంలో ఉన్న ఆహార పదార్థాలను ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ చేసుకుంటున్నారు. గ్రామాలలో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు టెకీలు ప్రాధాన్యమిస్తున్నారు. (చదవండి: కరోనా రాకుండా తండ్రికి విషమిచ్చి..)

మరిన్ని వార్తలు