రోజుకు 3,000 మంది ఔట్.. ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్, ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?

22 Jan, 2023 17:04 IST|Sakshi

ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఇతరాత్ర కారణాల వల్ల ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్న సంస్థల జాబితా ఈ ఏడాది జనవరి 1 నుంచి వాటి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి

ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే జాబితాలో టెక్‌ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, మెటా,ట్విటర్‌,విప్రో, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి సంస్థలు చేరిపోయాయి. వెరసీ వరల్డ్‌ వైడ్‌గా రోజుకు 3వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. 

టెక్‌ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 166 టెక‍్నాలజీ రంగా నికి చెందిన సంస్థ 65వేల మందిని ఇంటికి సాగనంపాయి. 

గూగుల్‌ ఇటీవల తన వర్క్‌ ఫోర్స్‌లో 6 శాతంతో 12వేల మందిని ఫైర్‌ చేసింది. 

గత వారం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. సంస్థలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ -2023, క్యూ3లో సుమారు 10వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తామని అన్నారు. 

అమెజాన్‌ సైతం ప్రపంచ వ్యాప్తంగా 18వేల మందిని ఉద్యోగుల్ని తొలగించగా వారిలో వెయ్యి మంది భారత్‌కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. 

దేశీయ సోషల్‌ మీడియా దిగ్గజం షేర్‌ చాట్‌ మార్కెట్‌లో నెలకొన్ని అనిశ్చితుల కారణంగా సుమారు తన మొత్తం వర్క్‌ ఫోర్స్‌లో 20 శాతంతో 500 ఉద్యోగుల్ని పక్కన పెట్టింది. 

టెక్‌ జెయింట్‌ విప్రో ఇంటర్ననల్‌గా అసిస్‌మెంట్‌ టెస్ట్‌లో పేలవమైన పనితీరు కారణంగా 452 మంది ఫ్రెషర్స్‌పై వేటు వేసింది. 

వృద్ది రేటు తక్కువగా ఉందని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌స్విగ్గీ 380 మందిని ఫైర్‌ చేసింది. 

సంస్థలో పునర్నిర్మాణం పేరుతో డిజిటల్‌ హెల్త్‌ కేర్‌ ప్లాట్‌ ఫారమ్‌ మెడిబడ్డీ 2వేల మందిని తొలగించింది. 

ఓలా 200 మంది సిబ్బందని పక్కన పెట్టేయగా, వాయిస్‌ ఆటోమెటెడ్‌ స్టార‍్టప్‌ స‍్కిట్‌.ఏఐ లేఆఫ్స్‌ ప్రకటించి చర్చనీయాంశంగా మారింది.

కాస్ట్‌ కటింగ్‌ అంటూ గ్రోసరీ డెలివరీ సంస్థ డున్జో 3శాతం వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించాయి. 

ఇక ఈఏడాది లో టెక్‌ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల్ని ప్రకటించాయి. వాటిలోసైబర్‌ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ 450 మంది సిబ్బందిని ఫైర్‌ చేయగా ..వృద్ది రేట్లు, లాభ,నష్టాలనే కారణాల్ని చూపెట్టింది.  

లేఆఫ్స్‌,ఎఫ్‌వైఐ ప్రకారం.. గతేడాది మొత్తం వెయ్యి కంపెనీలు 154,336 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేశాయి. 
 

చదవండి👉  నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ?

మరిన్ని వార్తలు