ఊహించని షాక్‌లు, ఉద్యోగులను వణికిస్తున్న ఐటీ కంపెనీలు.. టెక్కీల తక్షణ కర్తవ్యం?

1 Dec, 2022 20:30 IST|Sakshi

సాఫ్ట్‌వేర్‌ రంగంలో.. మరోసారి సంక్షోభం! 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు! అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా.. కార్యకలా΄ాలు నిర్వహిస్తున్న దిగ్గజ ఐటీ సంస్థల ఆదాయాల్లో తిరోగమనం! పర్యవసానం.. భారీ సంఖ్యలో కొలువుల కోతలను ప్రారంభించిన సంస్థలు!! మూడు నెలలుగా సంకేతాలు ఇస్తున్న సంస్థలు.. తాజాగా దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లే అఫ్స్‌ ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు, తక్షణ కర్తవ్యం ఏమిటి, భవితకు భరోసా ఇచ్చే నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ఎలా.. తదితర వివరాలతో సమగ్ర కథనం.. 

అమెరికాలో ఆర్థిక మాంద్యం సంకేతాల ప్రభావం జాబ్‌ మార్కెట్‌పై పడింది. ప్రముఖ ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో హెచ్‌–1బీ వీసాపై యూఎస్‌లోని సంస్థల్లో పని చేస్తున్న మన దేశ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం.. వారు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల లోపు కొత్త ఉద్యోగం దక్కించుకోకుంటే.. స్వదేశానికి తిరిగొచ్చేయాల్సి ఉంటుంది. 

ఫాంగ్‌ మొదలు స్టార్టప్స్‌ వరకు
ఫాంగ్‌ (ఎఫ్‌ఏఏఎన్‌జీ) సంస్థలుగా గుర్తింపు ΄÷ందిన ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌ మొదలు వందల సంఖ్యలోని స్టార్టప్‌ సంస్థల వరకూ.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఫేస్‌బుక్‌లో 11 వేలు, అమెజాన్‌లో పది వేలు, గూగుల్‌లో పది వేలు, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలో మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం మేరకు కొలువుల కోతలు ్ర΄ారంభమయ్యాయి. ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చైనాలో కోవిడ్‌ ఆంక్షలు, ఐఫోన్‌14 ్ర΄ో తయారీలో ఇబ్బందులు తదితర కారణాలతో రాబడులు తగ్గడంతో యాపిల్‌ సంస్థ లేఅఫ్స్‌కు సిద్ధమైనట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక స్పష్టం చేసింది.

మైక్రోబ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాన్‌ మస్క్‌ చేతిలోకి రాగానే భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత పడింది. ట్విటర్‌ ఇండియా ఆఫీస్‌లో 90 శాతం మంది తొలగింపునకు గురయ్యారు. వీటితో΄ాటు ఇంటెల్‌ సంస్థలో రానున్న రెండేళ్లలో దశల వారీగా 20 వేల ఉద్యోగాలు, హెచ్‌పీలో ఆరు వేల మంది, సిస్కోలో నాలుగు వేల మందికిపైగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగ సంస్థల్లోనే కాకుండా.. సర్వీసెస్‌ విభాగంగా పరిగణించే ఉబెర్, జొమాటో, బుకింగ్‌ డాట్‌ కామ్, బైజూస్, గ్రూప్‌ ఆన్‌ తదితర కంపెనీల్లో కూడా కోతలు మొదలయ్యాయి.

మాంద్యం.. ముందు జాగ్రత్త
ప్రస్తుతం సంస్థలు ఉద్యోగులను తొలగించడానికి రానున్న కొద్ది నెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా సంస్థల ఆర్థిక రాబడుల్లో ప్రతిబింబించింది. దాదాపు అన్ని సంస్థల రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం తగ్గింది. దీంతో.. సదరు సంస్థలు వ్యయ నియంత్రణలో భాగంగా, ముందు జాగ్రత్త చర్యగా.. మానవ వనరులపై చేసే వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయనే అభి్ర΄ాయం వ్యక్తమవుతోంది. 

ఇప్పుడేం చేయాలి
ఇప్పటికే దాదాపు లక్షన్నర మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారు ‘ఇప్పుడేం చేయాలి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. సంస్థలు.. పనితీరు, సామర్థ్యం ఆధారంగా తొలగిస్తున్నాం అని చెబుతుండటంతో.. ఉద్యోగాలు కోల్పోయిన వారు ‘తమ పనితీరు బాగా లేదా’ అనే ఆవేదనకు గురవుతున్నారు. అదే విధంగా.. కొత్త రిక్రూట్‌మెంట్‌లపైనా సంస్థలు కొంత కాలం నిషేధం విధించే అవకాశముంది. దీంతో తమ పరిస్థితి ఏంటి? అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆందోళన చెందకుండా.. ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాలి. ఫ్రెషర్స్, మిడిల్‌ లెవెల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ తమ ్ర΄÷ఫైల్‌కు అనుగుణంగా స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

స్కిల్‌ గ్యాప్‌ తగ్గించుకోవడమే
ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారు తక్షణం తమ స్కిల్‌ గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ్ర΄÷ఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ను ఆసరగా తీసుకోవాలి. అందులోని జాబ్‌ లిస్టింగ్స్‌లో పేర్కొన్న డిమాండింగ్‌ స్కిల్స్‌ను పరిశీలించాలి. తమ అర్హతలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఉదాహరణకు లింక్డ్‌ఇన్‌ జాబ్‌ ΄ోస్టింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. మీరు ΄ోస్ట్‌ చేసిన రెజ్యుమే ఆధారంగా మీ డొమైన్‌కు సంబంధించి కొత్త జాబ్‌ ΄ోస్టింగ్‌ను తెలియజేయడంతో΄ాటు.. మీరు పెంచుకోవాల్సిన స్కిల్స్‌ ఏంటి అనే విషయాన్ని గురించి కూడా వివరించేలా ఉంటుంది. దీంతో మీరు ఇంకా పెంచుకోవాల్సిన స్కిల్స్‌ను స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ఇలా స్పష్టత తెచ్చుకున్నాక..సదరు నూతన నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. లింక్డ్‌ఇన్‌తో΄ాటు షైన్‌డాట్‌ కామ్, మాన్‌స్టర్‌ ఇండియా, నౌకరీ డాట్‌ కామ్‌ వంటి వాటి ద్వారా మీ డొమైన్, జాబ్‌ ్ర΄÷ఫైల్‌కు అనుగుణంగా అవసరమవుతున్న స్కిల్స్‌ గురించి తెలుసుకొని.. వాటిపై పట్టు సాధించాలి. 

స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలు
స్కిల్‌ గ్యాప్‌ను తగ్గించుకుని కొత్త ఉద్యోగాల వేటలో ముందంజలో నిలిచేందుకు వీలుగా స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. మీ అకడమిక్‌ డొమైన్‌కు సరితూగే ప్రత్యేక స్కిల్స్‌పై పట్టు సాధించాలి. ఉదాహరణకు మీరు ఐటీ విభాగంలో ఉంటే.. కొత్తగా ఆటోమేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవడానికి కృషి చేయాలి. అదే విధంగా మీరు సంప్రదాయ డిగ్రీ నేపథ్యం గల వారైతే.. ఇప్పటివరకు చేసిన ఉద్యోగానికి సంబంధించి కొత్తగా వచ్చిన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. డేటాసైన్స్, ఈఆర్‌పీ సొల్యూషన్స్‌ వంటి కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి.

సర్టిఫికేషన్స్‌పై దృష్టి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా విభాగాల్లో సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడం కూడా ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌గా జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఏఐ–ఎంఎల్, రోబోటిక్స్, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి వాటిపై ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటిని రెండు నెలలలోపు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన 5జీ టెక్నాలజీస్‌పైనా దృష్టి పెడితే అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. ముఖ్యంగా కోడింగ్, ్ర΄ోగ్రామింగ్, ఇండస్ట్రీ 4.0 వంటి ఐటీ స్కిల్స్‌పై మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్, హెచ్‌పీ, ఏడబ్ల్యూఎస్, సిస్కో, వీఎంవేర్, ఒరాకిల్‌ వంటి పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నేరుగా ఆన్‌లైన్‌ విధానంలో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి.

ఖాళీగా ఉండకుండా
ఉద్యోగం కోల్పోయిన వారు ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం సరికాదు. తమ అర్హతలకు సరితూగే ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్‌ జాబ్స్‌ అవకాశాలను అన్వేషించి.. వాటిని సొంతం చేసుకునేలా అడుగులు వేయాలి. పలు జాబ్‌ ΄ోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్స్‌లో ఈ అవకాశాల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ, వేతనాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా కొలువులో చేరి.. మెరుగైన అవకాశం లభించే దాకా కొనసాగాలి. కొన్ని సందర్భాల్లో చిన్న΄ాటి స్టార్టప్‌ సంస్థల్లో ΄÷ందిన అనుభవమే భవిష్యత్తులో మంచి సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందని గుర్తించాలి.

మిడ్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌
12 నుంచి 15ఏళ్ల అనుభవమున్న వారిని మిడ్‌ లెవల్, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారిని కూడా సంస్థలు తొలగిస్తున్నాయంటే.. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా నాలెడ్జ్‌ అప్‌డేట్‌ చేసుకోక΄ోవడం కూడా ఒక కారణమై ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సీనియర్‌ ఉద్యోగులు తాము ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన విభాగాలు, వాటికి సంబంధించి మార్కెట్‌లో ఆవిష్కృతమవుతున్న కొత్త నైపుణ్యాలను తెలుసుకుని.. వాటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌
ఉద్యోగాలు కోల్పోయిన వారు.. నూతన ఉద్యోగ సాధనలో భాగంగా..సోషల్‌ నెట్‌వర్కింగ్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలి. సదరు నెట్‌వర్కింగ్‌ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో సంప్రదింపులు చేయాలి. ఇప్పటి వరకు తమ ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలు, అవి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన తీరు వంటి వాటిని వారిని మెప్పించే రీతిలో వివరించాలి. కొత్త ఉద్యోగాలకు తమను సిఫార్సు చేసే విధంగా ఆయా రంగాల్లోని నిపుణులను ఒప్పించాలి.

సాఫ్ట్‌ స్కిల్స్‌
ప్రస్తుతం పనితీరు ఆధారంగా తొలగింపులు అని ప్రకటిస్తున్న సంస్థలు.. ఉద్యోగుల్లోని సాఫ్ట్‌స్కిల్స్‌ను కూడా మదింపు చేస్తున్నాయి. కాబట్టి సాఫ్ట్‌స్కిల్స్‌లో కీలకంగా భావించే కమ్యూనికేషన్‌ స్కిల్స్, బిహేవియరల్‌ స్కిల్స్, క్రిటికల్‌ థింకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ వంటి నైపుణ్యాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. అదే విధంగా వీలైతే తమను తొలగించడానికి గల నిర్దిష్ట కారణాన్ని తమ టీమ్‌ హెడ్‌ లేదా ప్రాజెక్ట్‌ హెడ్‌ ద్వారా తెలుసుకుని లో΄ాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. 

ఆత్మ విశ్వాసం
ఉద్యోగ తొలగింపునకు గురైనవారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. ఆందోళన నుంచి బయటపడాలి. సాధించగలమనే మనో ధైర్యంతో కొత్త అవకాశాలను దక్కించుకోవాలి.

చదవండి: అలర్ట్‌: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్‌!

మరిన్ని వార్తలు