మెటల్‌, ఐటీ జంప్‌ : మూడో రోజూ బుల్‌ జోరు

10 Mar, 2021 16:42 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లోనే ముగిసాయి. ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గిన  సూచీలు రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఐటీ, ఫార్మా, మెటల్స్‌ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో చివరికి లాభాల్లోనే స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌ 254 పాయింట్ల లాభంతో 51280 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 15175 ముగిసాయి.

మెటల్ ఇండెక్స్ 1.87 శాతం ఎగిసి ఈ రోజు స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచింది, తరువాత నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1.67 శాతం లాభపడింది. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ .ఓఎన్‌జీసీ,, ఐఓసీ , హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, గెయిల్‌, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

మరిన్ని వార్తలు