చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు

9 Dec, 2020 14:13 IST|Sakshi

చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద నేటి ఉదయం నుండి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో 100  టీమ్స్ తో కలిసి ఐటీ బృందం సోదాలు జరుపుతుంది. చెట్టినాడు గ్రూప్ ఫై చెన్నైలో సీబీఐ కేసు నమోదు అయింది. నేటి ఉదయం నుండి కంపెనీల మీద, చెట్టినాడ్ ఛైర్మెన్ ముత్తయ్యా ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోను సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాణం, సిమెంట్, పవర్, స్టీల్ బిజినెస్ లో చెట్టినాడ్ గ్రూప్ వ్యాపారాలు చేస్తోంది. చెన్నైలో ఉన్న చెట్టినాడ్ హెడ్ ఆఫీస్ లో ఐటి సోదాలు జరగగా, అలాగే హైదరాబాద్ లో ఉన్న చెట్టినాడ్ కార్యాలయంలో కూడా ఐటి సోదాలు జరుగుతూన్నాయి. 2015లోనూ భారీగా పన్ను ఎగువేతకు సంబందించి దాడులు చేసిన ఐటి అప్పుడు పన్ను ఎగవేతకు సంబంధించి ఎటువంటి అధరాలు చూపలేకపోయింది. తమిళనాడు, తెలంగాణ, ఏపీ ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.(చదవండి: వ్యాక్సిన్‌ షాక్‌- పసిడి ధరల పతనం)

మరిన్ని వార్తలు