కళ్లు చెదిరేలా ఐటీలో తెలంగాణ అభివృద్ధి.. కేటీఆర్‌ స్పెషల్‌ వీడియో

4 Oct, 2021 10:14 IST|Sakshi

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఐటీ రంగంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలను వెల్లడిస్తూ రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

ఐటీ సెక్టార్‌కి సంబంధించి 2014లో ఎగమతుల విలువ రూ. 57 వేల కోట్ల రూపాయలు ఉండగా 2021కి వచ్చేసరికి 1.45 లక్షల కోట్లకు చేరుకుందని ఐటీ మంత్రి తెలిపారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షల మంది ఉండగా ప్రస్తుతం 6.28 లక్షల మంది ఐటీ సెక్టార్‌లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని, పరోక్షంగా 20 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ఈ వీడియోలో తెలిపారు. ఇంకా ఈ రంగానికి సంబంధించిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో ఆవిష్కరించారు.

చదవండి : బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు

మరిన్ని వార్తలు