ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌ న్యూస్‌.. ఇక పదేళ్లూ అంతంతే!

30 Mar, 2023 11:08 IST|Sakshi

ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది.

(రియల్‌మీ సి–55.. ఎంట్రీ లెవెల్‌ విభాగంలో సంచలనం!)

ఆడిట్ అండ్‌ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్‌ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

(మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!)

ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు.

గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్‌సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది.

(మారుతీ సుజుకీ రికార్డ్‌.. విదేశాలకు 25 లక్షల కార్లు..)

25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్‌ఆర్ హెడ్‌ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్‌లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా.

మరిన్ని వార్తలు