IT Tax Return: డెడ్‌లైన్‌ వచ్చేసింది.. లేదంటే రూ.5000 ఫైన్‌!

30 Jul, 2022 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు రిటర్నుల దాఖలు గడువు సమీపించడంతో త్వరపడుతున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి 4.09 కోట్ల రిటర్నులు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఒక్క 28వ తేదీన 36 లక్షల రిటర్నులు సమర్పించారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ సంవత్సరం (2022–23) రిటర్నులు దాఖలు చేసేందుకు ఈ నెల 31న చివరి తేదీ. ఇప్పటి వరకు రిటర్నులు వేయకపోతే వెంటనే ఆ పని చేయాలని, దీనివల్ల ఆలస్యపు ఫీజు చెల్లించే అవసరం ఏర్పడదని ఆదాయపన్ను శాఖ మరోసారి సూచించింది.

గడువులోగా ఐటీఆర్‌ దాఖలు చేయకుంటే.. వార్షిక ఆదాయం ₹ 5 లక్షల వరకు ఉన్నవారు ఫైన్‌ కింద ₹ 1,000, ₹ 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ₹ 5,000 ఫైన్‌ కట్టాల్సిఉంది. ఆదాయపన్ను శాఖ గతేడాది నూతన ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. అయినా ఇప్పటికీ పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు పన్ను చెల్లింపుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువును పొడిగించాలంటూ డిమాండ్లు రాగా, గడువు పొడిగించేది లేదని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది.

చదవండి: ఓలా ఉద్యోగులకు షాక్‌.. వందల మంది తొలగింపు..?

మరిన్ని వార్తలు