ఐటీసీ చేతికి యోగా బార్‌

19 Jan, 2023 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ డైరెక్ట్‌ టు కన్జూమర్‌(డీటూసీ) బ్రాండ్‌ యోగా బార్‌ను సొంతం చేసుకోనుంది. బ్రాండ్‌ మాతృ సంస్థ స్ప్రవుట్‌లైఫ్‌ ఫుడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఎస్‌ఎఫ్‌పీఎల్‌)లో 100 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీసీ వెల్లడించింది. మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో వాటాను చేజిక్కించు కో నున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా తొలుత 47.5 శాతం వాటాను దశలవారీగా 2025 మార్చి 31కల్లా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.  

కొనుగోలు తీరిలా
తొలుత 2023 ఫిబ్రవరి 15కల్లా ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 39.4 శాతం వాటాకుగాను రూ. 175 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఐటీసీ తెలియజేసింది. తదుపరి మరో రూ. 80 కోట్లు వెచ్చించడం ద్వారా 47.5 శాతానికి వాటాను పెంచుకోనున్నట్లు వివరించింది. మిగిలిన 52.5 శాతం వాటాను సైతం తదుపరి దశలలో కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఎస్‌ఎఫ్‌పీఎల్‌.. కొత్తతరం డిజిటల్‌ ఫస్ట్‌ బ్రాండ్‌ యోగా బార్‌ పేరున న్యూట్రిషన్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. వేగవంత వృద్ధిలో ఉన్న పౌష్టికాహార విభాగంలో ఏర్పాటైన స్టార్టప్‌ ఎస్‌ఎఫ్‌పీఎల్‌.. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 68 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

మరిన్ని వార్తలు