ఐటీసీ ఫలితాలు భేష్‌

26 Jul, 2021 00:24 IST|Sakshi

నికర లాభం రూ. 3,343 కోట్లు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 30 శాతంపైగా ఎగసి రూ. 3,343 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 36 శాతం జంప్‌చేసి రూ. 14,241 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 10,220 కోట్లను తాకాయి. కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌లోనూ వివిధ విభాగాలు పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ పేర్కొంది.  

విభాగాల వారీగా 
ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ 24 శాతం వృద్ధితో రూ. 9,534 కోట్లను అధిగమించింది. సిగరెట్ల విభాగం 34 శాతం పుంజుకుని రూ. 5,803 కోట్లకు చేరింది. కాగా.. ఎఫ్‌ఎసీజీ ఇతర విభాగంలో బ్రాండెడ్‌ ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్, స్నాక్స్, డైరీ, పానీయాలు, స్టేషనరీ తదితరాల టర్నోవర్‌ 10 శాతంపైగా బలపడి రూ. 3,731 కోట్లను తాకింది. హోటళ్ల ఆదాయం ఐదు రెట్లు ఎగసి రూ. 134 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు