తక్కువ ధరలోనే ఐటెల్ 4జి ట్యాబ్ వచ్చేసింది.. వివరాలు

4 Mar, 2023 11:15 IST|Sakshi

దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఐటెల్ కంపెనీ తన మొదటి ట్యాబ్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ట్యాబ్‍ పేరు 'ఐటెల్ ప్యాడ్ వన్'. దీని ధర రూ.12,999. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగిన ఈ ట్యాబ్ త్వరలో ఆన్‍లైన్, ఆఫ్‍లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

ఐటెల్ ప్యాడ్ వన్ తక్కువ ధరలకు లభించే లేటెస్ట్ ట్యాబ్. ఇది డీప్ గ్రే, లైట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఇందులో 4జీ కనెక్టివిటీ ఫీచర్‌ కలిగి, మెటల్ బాడీ పొందుతుంది. 10.1 ఇంచెస్ హెచ్‍డీ+ ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ట్యాబ్ ఎడ్జ్‌లు ఫ్లాట్‍గా ఉండటం వల్ల మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది.

ఐటెల్ ప్యాడ్ వన్ ట్యాబ్‍లో యునీఎస్‍ఓసీ ఎస్‍సీ9863ఏ1 ప్రాససెర్ ఉంటుంది. మొమరీ కార్డు ద్వారా 512 జీబీ వరకు స్టోరేజీ పెంచుకోవచ్చు. అంతే కాకుండా, ఇది ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త ట్యాబ్‍లో 6,000mAh బ్యాటరీ ఉంటుంది. కావున ఇది స్టాండర్డ్ 10 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో సింగిల్ సిమ్, 4జీ ఎల్‍టీఈ, వైపై, బ్లూటూత్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5మిమీ హెడ్‍ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అప్షన్ అవుతుంది.

మరిన్ని వార్తలు