ఐటీఐ నుంచి ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌

30 Jan, 2023 10:27 IST|Sakshi

ఐటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్‌కు సంబంధించి న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 10న ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ప్రామాణికంగా ఉంటుంది.

దీని ద్వారా సమీకరించిన నిధులను లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో సంస్థ ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ఇన్వెస్ట్‌ చేయాలనుకునే మదుపరులకు ఇది అనువుగా ఉంటుంది. ధీమంత్‌ షా, రోహన్‌ కోర్డే ఈ ఫండ్‌ను నిర్వహిస్తారు. 2019లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐటీఐ .. ప్రస్తుతం 16 ఫండ్లను అందిస్తోంది. గతేడాది డిసెంబర్‌ నాటికి దాదాపు రూ. 3,557 కోట్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది.

చదవండి: ఆ సూపర్‌ లగ్జరీ కార్ల క్రేజ్‌.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది!

మరిన్ని వార్తలు