ITR Filling Benefits: ఆదాయ పన్నుపరిధిలోకి రాకపోయినా, ఐటీఆర్‌ ఫైలింగ్‌ లాభాలు తెలుసా?

25 Jul, 2022 10:45 IST|Sakshi

సాక్షి,ముంబై: ఇన్‌కం టాక్స్ రిట‌ర్న్స్ (ఐటీఆర్‌) దాఖ‌లుకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల (జూలై,31) చివరి లోపు త‌ప్ప‌నిస‌రిగా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్‌ను కచ్చితంగా పూర్తి చేయాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ITR ఫైలింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే. అయితే  ఆదాయ పన్ను పరిధిలోకి రాని వారు కూడా ఐటీఆర్‌ ఫైలింగ్‌  చేయవచ్చు. దాని వల్ల చాలా  ప్రయోజనాలున్నాయి

రూ.2.5ల‌క్ష‌ల్లోపు ఉన్న వారుఐటీఆర్‌ ఫైల్‌ చేయడం తప్పనిసరికాదు. ఫైల్‌ చేయక పోయినా జరిమానా ఉండదు.  60 ఏళ్లు పైబడి 80 ఏళ్లలోపు పన్ను చెల్లింపుదారులకు, ఈ మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు. 80 ఏళ్లు పైబడిన వారికి  పన్ను మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలు ఈ నేపథ్యంలోనే సాధారణంగా చాలామంది ఐటీఆర్ దాఖ‌లును పట్టించుకోరు. కానీ  ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయడం వల్ల ఈజీగా బ్యాంక్‌ రుణం పొందడం, క్రెడిట్ కార్డ్ లేదా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్‌  ఈజీ లాంటి ఇతర లాభాలు న్నాయి.

ఐటీఆర్  ఫైలింగ్‌, లాభాలు
ఈజీగా రుణాలు : ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఐటీఆర్‌  కీలకం. ఐటీఆర్‌ను బ్యాంకులు, ఇతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు ఆదాయ వనరుకు రుజువుగా  భావిస్తాయి. సో.. రెగ్యుల‌ర్‌గా ఐటీఆర్ దాఖ‌లు చేస్తూ ఉంటే రుణం పొంద‌డం తేలిక. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాన్ని చవిచూసి ఉంటే, తదుపరి ఏడాది సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది. గడువు తేదీకి ముందే ITRని ఫైల్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. 

వీసా ప్రాసెస్‌: అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ వీసా ప్రాసెసింగ్‌ సమయంలోసంబంధిత ఇమ్మిగ్రెంట్ కార్యాలయంలో ఐటీ రిట‌ర్న్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.  దాదాపు 3-5 ఏళ్ల ఐటీఆర్ హిస్టరీ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. అంటే క్రమం తప్పకుండా  ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే. ఈ ప్రాసెస్‌లో ఆటంకాలను తగ్గించు కోవచ్చు. 

టీడీఎస్‌,రాయితీ క్లెయిమ్: ఆదాయం ప‌న్ను ప‌రిమితికి లోబ‌డి ఆదాయం ఉన్నా, ఐటీ విభాగం ప‌న్ను విధించి ఉంటే దాన్ని క్లెయిమ్‌కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ సాయపడుతుంది. పెట్టుబడిపై ఏదైనా పన్ను మినహాయింపు లభించిందా అని ఫారమ్ 26ASలో చెక్‌ చేసు కోవచ్చు. ఐటీఆర్‌ను ఆదాయం ప‌న్ను విభాగం అధికారులు అంచ‌నా త‌ర్వాత, ఏమైనా రిఫండ్‌ ఉండే అది నేరుగా సంబంధిత వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో జ‌మవుతుంది. అలాగే, ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదంలో వైకల్యం సంభవించిన సందర్భాల్లో పరిహారం పొందేటప్పుడు  కూడా ఐటీఆర్‌ ఒక ముఖ్యమైన ఆదాయ రుజువుగా ఉపయోగపడుతుంది.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌, షేర్లలో నష్టాలొచ్చినపుడు
మీరు ఒక‌వేళ మ్యూచువ‌ల్ ఫండ్స్‌, షేర్ల‌లో పెట్టిన పెట్టుబ‌డుల‌పై న‌ష్టాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం  ఆదాయంలో సర్దుబాటు చేసుకోవచ్చు. నిర్ధిష్ట గ‌డువులోగా ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసిన వారు ఈ ప‌న్ను మిన‌హాయింపును అభ్యర్థించవచ్చు.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 70,  71 ఒక నిర్దిష్ట సంవత్సరంలోని నష్టాలను తదుపరి సంవత్సరానికి నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు .

దీంతోపాటు ఆధార్ కార్డ్ లేదా మరేదైనా డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఐటీఆర్‌  ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీన్ని అడ్రస్‌ఫూఫ్‌గా కూడా అంగీకరిస్తుంది. అలాగే స్వయం ఉపాధి పొందుతున్నవారికి, ఫారమ్ 16 అందుబాటులో లేని వారికి ఐటీఆర్‌ ఫైలింగ్‌ చాలా  ఉపయోగపడుతుంది.

మరిన్ని వార్తలు