2020-21 ఐటీ రిటర్న్‌ ఫారమ్‌ల నోటిఫై!  

2 Apr, 2021 11:22 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి కొత్త ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను (ఐటీఆర్ ) తెలియజేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌-19 సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఐటీఆర్‌ ఫారమ్‌ల ఫైలింగ్‌లో కూడా ఎటువంటి మార్పులూ చేయలేదని  వెల్లడించింది.

ఆదాయపు పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ ఫామ్స్‌ను నోటిఫై చేసింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) గురువారం ఒక ప్రకటన చేస్తూ, కరోనా సంక్షోభం నేపథ్యంలో  గత ఏడాది ఐటీఆర్‌ఫారమ్‌లలో ఎటువంటి కీలక మార్పులూ చేయకుండా, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా తాజా ఫారమ్‌లను నోటిఫై చేసినట్లు వివరించింది. నోటిఫైడ్ ఐటిఆర్ ఫారాలు ఇ-గెజిట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

ఐపీవోకు సెవెన్‌ ఐలాండ్స్‌.. 
న్యూఢిల్లీ: సముద్ర రవాణా కంపెనీ సెవెన్‌ ఐలాండ్స్‌ షిప్పింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతిని పొందింది. ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. దీనికి అదనంగా మరో రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. కాగా.. 2003లో ప్రారంభమైన కంపెనీ ఇంతక్రితం 2017లోనూ ఐపీవో ప్రయత్నాలు చేయడం గమనార్హం! 

మరిన్ని వార్తలు