ఏ ఆదాయవర్గాల వారికి ఐటీఆర్‌ ఫారం 2 అవసరం

28 Jun, 2021 10:36 IST|Sakshi

గత వారం ఐటీఆర్‌  ఫారం 1 గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఐటీఆర్‌ ఫారం 2కి సం బంధించిన విషయాలు తెలుసుకుందాం. ఇది ఎవరికి వర్తిస్తుందంటే.. కేవలం వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలే దీన్ని దాఖలు చేయొచ్చు. ఇక ఏ ఆదాయవర్గాల వారు దాఖలు చేయొచ్చంటే.. 

 • జీతం రూపంలో ఆదాయం ఉన్నవారు 
 • పింఛను అందుకునేవారు 
 • ఇంటి మీద ఆదాయం పొందేవారు (ఎన్ని ఇళ్లున్నా .. అంటే రెండు అంతకు మించిన సంఖ్యలో ఇళ్లపై ఆదాయం పొందుతున్నవారు) 
 • ఇతరత్రా ఆదాయ మార్గాలు, లాటరీలు, గుర్రపు పందాలు మొదలైన వాటి ద్వారా ఆదాయం రూ. 50,000 దాటితే ఈ ఫారం దాఖలు చేయవచ్చు 
 • వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవారు 
 • విదేశాలలో ఆస్తులు ఉన్న వారు, విదేశాల నుంచి ఆదాయం ఉన్నవారు 
 • కంపెనీలలో డైరెక్టర్లు 
 • క్యాపిటల్‌ గెయిన్స్‌ ఆదాయం గలవారు 
 • అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో వాటా ఉన్న వారు 
 • నాన్‌ రెసిడెంట్లు 

ఎవరికి ఇది వర్తించదంటే.. 

 • వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు 
 • వృత్తి మీద ఆర్జించేవారు 
 • ఫారం 1 వేయడానికి అర్హులైన వ్యక్తులు 
 • ఫారం 1 దాఖలు చేయడానికి అర్హత గల ఉమ్మడి కుటుంబాలు 
 • స్థూలంగా చెప్పాలంటే.. రూ. 50,00,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు ఫారం 1, అంతకు మించి ఉన్నవారు ఫారం 2 దాఖలు చేయాలని భావించవచ్చు. ఫారం 1 వేసే వారు ఫారం 2 వేయకూడదు. ఫారం 2 దాఖలు చేసే వారు ఫారం 1 దాఖలు చేయకూడదు. సర్దుబాటు కాని నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసేవారు ఫారం 2ని ఉపయోగించాలి. మిగతా ప్రక్రియంతా షరా మామూలే.  


కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి,కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు