‘ట్విటర్‌ ఉద్యోగులారా..ప్లీజ్‌ నన్ను క్షమించండి’: జాక్‌ డోర్సే

6 Nov, 2022 11:27 IST|Sakshi

ట్విటర్‌ సంస్థలో జరుగుతున్న వరుస పరిణామాలపై ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్‌ నిర్ణయాన్ని డోర్సే తప్పు బట్టారు. ట్విటర్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారు తనని క్షమించాలని కోరారు.

ఉద్యోగులు నాపై కోపంగా ఉన్నారని తెలుసు, వారు ఎదుర్కొంటున్న కఠిమైన సమయానికి నేను పూర్తి బాధ్యత వహిస్తాను. సంస్థ వృద్ధి కోసం అతి తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్నాను. అందుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  

కాగా, 44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్‌ మస్క్‌ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయ గద్దె వంటి ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని తొలగించారు.  

చదవండి👉 ‘ట్విటర్‌లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్‌ అగర్వాల్‌ ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు