ట్విటర్‌ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు

23 Mar, 2023 18:59 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికా షార్ట్‌   సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్  రీసెర్చ్  తన నెక్ట్స్‌ బాంబును ట్విటర్‌మాజీ సీఈవో  జాక్ డోర్సేపై వేసింది.  డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ను ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది. 

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్‌ సంస్థ అక్రమాలను బైట పెట్టింది. తమ రెండేళ్లలో పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు షార్ట్ సెల్లర్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొంది.  ముఖ్యంగా  తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది.  తన ఫేక్‌ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న "మాయాజాలం"అని వ్యాఖ్యానించింది.   

బ్లాక్‌ సంస్థ  "అండర్‌బ్యాంక్" కస్టమర్లలో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తులు న్నారని కూడా ఆరోపించింది. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సృష్టించడం, ఆపై  అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసిందని తెలిపింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది.  కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్‌ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం. 

మరిన్ని వార్తలు