తెలిసిన జాక్‌మా జాడ! ఎక్కడ ఉన్నాడంటే..

20 Feb, 2023 12:39 IST|Sakshi

చైనాకు చెందిన టాప్‌ బిలియనీర్‌, అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. కొన్ని నెలల క్రితం చైనా నుంచి అదృశ్యమైన ఆయన మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్‌లో కనిపించాడని, కొన్ని రోజులపాటు ఆ  దేశంలోనే జాక్‌మా గడిపినట్లు చైనాకు చెందిన వయికై మీడియా సంస్థ పేర్కొంది. అయితే దీన్ని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ధ్రువీకరించడం లేదు.

ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం
ఆస్ట్రేలియాలో జాక్‌మా జాడపై స్పష్టత లేనప్పటికీ, ఆయనకు ఆస్ట్రేలియాతో విడదీయరాని సంబంధం ఉంది. అక్కడి మోర్లీ కుటుంబానికి మా సన్నిహితంగా ఉండేవారు. 1980 ప్రాంతంలో న్యూ సౌత్ వేల్స్‌లోని న్యూకాజిల్‌ను సందర్శించడానికి ఆయన టీనేజ్‌లో ఉన్నప్పుడు వచ్చారు. ఈ సమయంలో మెంటర్‌గా ఉంటూ జాక్‌మా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మోర్లీ కృషి చేశారు. అందుకే  2017లో దివంగత కెన్ మోర్లీ పేరు మీద 20 మిలియన్ డాలర్లతో యూనివర్శిటీ స్కాలర్‌షిప్ ఫండ్‌ను జాక్‌మా ఏర్పాటు చేశారు.

జాక్‌మా థాయ్‌లాండ్‌ వెళ్లే ముందు జపాన్ లోని టోక్యోతో పాటు ఇతర ప్రాంతాల్లో గడిపారు. ముయే థాయ్ బాక్సింగ్ మ్యాచ్‌లోనూ మా పాల్గొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఫైనాన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసేందుకు ఆయన గత నెలలో హాంకాంగ్‌ వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

(ఇదీ చదవండి: అదానీ, అంబానీలపై రామ్‌దేవ్‌ బాబా కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు