బుజ్జాయిల కోసం బుల్లి కెమెరా

29 Jan, 2023 07:46 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటుపడిన పిల్లలను ఆ అలవాటు నుంచి దూరం చేయాలంటే, ఈ బుల్లి కెమెరానే సరైన సాధనం అని చెబుతున్నారు దీని తయారీదారులు. చిన్నారులు సులువుగా ఉపయోగించుకునేలా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పాతకాలం పోలరాయిడ్‌ కెమెరా మాదిరిగానే ఇది పనిచేస్తుంది. దీంతో తీసే ఫొటోలో ఎప్పటికప్పుడు ప్రింట్‌ అయి బయటకు వచ్చేస్తాయి.

శక్తిమంతమైన లెన్స్, ఫ్లాష్‌ ఉండటంతో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు కూడా దీంతో చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. అయితే, దీని నుంచి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో మాత్రమే వస్తాయి. జపాన్‌కు చెందిన ‘కూల్‌ డిజైన్స్‌’ కంపెనీ ఈ కెమెరాను రూపొందించింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,527) మాత్రమే!

మరిన్ని వార్తలు