జపాన్‌ పెట్టుబడులకు కారణాలివే..

22 Sep, 2020 18:01 IST|Sakshi

టోక్యో: భారత్‌లో జపాన్‌ పెట్టుబడి పెట్టడానికి ప్రధన కారణాలను ఆర్థిక నిపుణులు, జపాన్‌కు చెందిన కోహి మాత్‌సూ విశ్లేషించారు. భవిష్యత్తులో భారత్‌ మెరుగైన వృద్ధి రేటు నమోదవ్వనుందని జపాన్‌ పెట్టుబడిదారులు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే భారత్‌లో రిటైల్‌, ఐటీ రంగాలలో గణనీయమైన వృద్ధి సాధించనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,400జపాన్‌ కంపెనీలు తమ సేవలు కొనసాగిస్తున్నాయి.

కాగా వియత్నంలోను జపాన్‌ భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికి, భవిష్యత్తులో అధిక జనాభా ఉన్న భారత్‌ వైపే జపాన్‌ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అయితే ఆటోమెటివ్‌, మెషినరీ రంగాలలో దేశంలో జపాన్‌ పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే మౌళిక సదుపాయాలు, విద్యుత్‌, సహజ విపత్తుల రంగాలలో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కోహి మాత్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు