Passport: పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు!

28 Jul, 2022 14:13 IST|Sakshi

ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం చాల మారిపోయింది. కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న దేశాలకు కూడా విద్య, వ్యాపారరీత్యా వెళ్లాల్సి రావడం షరా మామూలైంది. అయితే మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి(వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్‌ ర్యాంక్‌ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతరు దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది.  

తాజాగా హెన్లీ పాస్‌ పోర్ట్‌ ఇండెక్స్‌ ప్రకారం భారత్‌ 87వ స్థానం దక్కించుకుంది. దీని ప్రకారం భారతీయులు వీసా అవసరం లేకుండా 60 దేశాలకు ప్రయాణించే వెసలుబాటు ఉంది.‌ ఈ జాబితాలో.. జపాన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. జపాన్‌ పౌరులు వీసా లేకుండా 193 దేశాలు చుట్టేయవచ్చు. రెండో స్థానంలో సింగపూర్‌, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ సమాచారం ఆధారంగా హెన్లీ ఆండ్‌ పార్టనర్స్‌ పరిశోధకుల బృందం ప్రతి ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. 

చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా?

మరిన్ని వార్తలు