ఒక్క సెకన్‌లో 57వేల సినిమాల డౌన్‌లోడ్‌!

16 Jul, 2021 19:44 IST|Sakshi

జపాన్ దేశం ఇంటర్నెట్ స్పీడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంత వేగంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేయలేదు. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో సెకన్ల వ్యవధిలో భారీ మొత్తంలో డేటాను జపాన్ విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. జపాన్ కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎన్ ఐసీటీ) రీసెర్చర్ల బృందం ఒక సెకనకు 319 టెరాబైట్ల(Tbps) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసి విజయం సాధించారు. ఈ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌తో 57వేల సినిమాలను ఒక సెకనులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షలో భాగంగా 3,001 కిలోమీటర్ల దూరం 319 టీబీపీఎస్ వేగంతో డేటాను ప్రసారం చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. బెంజమిన్ జె.పుట్నం నేతృత్వంలోని పరిశోధకుల బృందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూర దూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటా ప్రసారం చేయడంలో విజయం సాధించారు. మల్టీప్లెక్సింగ్ టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకునే సామర్థ్యంతో ప్రసార వ్యవస్థను నిర్మించినట్లు బృందాలు తెలిపాయి. వారు విభిన్న యాంప్లిఫయర్ టెక్నాలజీలను మిళితం చేసి 319 టీబీపీఎస్ డేటా స్పీడ్‌తో ట్రాన్స్ మిషన్ చేసి విజయం సాధించారు.

మరిన్ని వార్తలు